Balakrishna : “స్వామి రామానుజాచార్య” పాత్రలో బాలయ్య?

Kaburulu

Kaburulu Desk

December 9, 2022 | 03:12 PM

Balakrishna : “స్వామి రామానుజాచార్య” పాత్రలో బాలయ్య?

Balakrishna : ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ “వీరసింహా రెడ్డి” సినిమాని పూర్తి చేసే పనిలో పడ్డాడు. మలినేని గోపీచంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది. వింటేజ్ బాలయ్యని పరిచయం చేస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘జై బాలయ్య’ సాంగ్ రెండు స్టేట్స్ లోను మోత మోగిపోతుంది.

Balakrishna : బాలకృష్ణకు హీరోయిన్‌గా ప్రియాంక జవాల్కర్?

తాజాగా బాలయ్య గురించి ఒక న్యూస్ సినీ వర్గాల్లో వినిపిస్తుంది. అదేంటంటే విశిష్టాద్వైతమును ప్రతిపాదించిన గొప్ప తత్వవేత్త రామానుజాచార్యుడు జీవిత చరితలో బాలయ్య నటించనున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహిస్తుండగా, ఆధ్యాత్మిక గురువు చినజీయర్ స్వామి స్క్రిప్ట్ ని అందించనున్నట్లు తెలుస్తుంది.

ఈ సినిమాను ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ నిర్మించనున్నాడట. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. కాగా బాలయ్య గతంలో శ్రీరామ రాజ్యం మరియు పాండురంగ మహత్యం వంటివి ఆధ్యాత్మిక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇక ఇవాళే తన 109వ సినిమాను మొదలుపెట్టాడు బాలయ్య. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నాడు.