Ramanuja Samatha Spoorthi Samatha Kumbh: రామానుజ సమతా స్పూర్తి సమతా కుంభ్ ఉత్సవాలు ప్రారంభం… ప్రత్యేకతలేంటో తెలుసా.?

Kaburulu

Kaburulu Desk

February 2, 2023 | 07:36 PM

Ramanuja Samatha Spoorthi Samatha Kumbh: రామానుజ సమతా స్పూర్తి సమతా కుంభ్ ఉత్సవాలు ప్రారంభం… ప్రత్యేకతలేంటో తెలుసా.?

హైదారాబాద్ నగరానికి దగ్గరలో గల ముచ్చింతల్ లో వెలసిన రామానుజ స్పూర్తి కేంద్రంలోని 108 దివ్యదేశాల బ్రహ్మోత్సవ ఉత్సవం మొదలైంది. శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్‌ స్వామిజీ ఆధ్వర్యంలో సమతా కుంభ వేడుకలు మొదలయ్యాయి. ఈ ఏడాది నుండి ప్రతీ సంవత్సరం ఇదే పేరుతో బ్రహ్మోత్సవాలు కనువిందు చేయనున్నాయి.  మరి ఈ బ్రహ్మోత్సవాల విశేషాలేంటో ఇపుడు తెలుసుకుందాం.

ఈ ఉత్సవాలు నేటి నుంచి ఫిబ్రవరి 12 వరకూ జరగనున్నాయి. ఇందులోని ప్రతి ఘట్టం ఆకర్షణీయంగా ఉండనున్నాయి. ముచ్చింతల్ పరిసర ప్రాంతాలన్నీ రామానుజాచార్య నామ స్మరణతో మారుమ్రోగబోతుంది. ఈ పదకొండు రోజులూ జరగబోయే బ్రహ్మోత్సవాలలో అనేకరకాల భక్తి పరవశమైన, ఆధ్యాత్మిక పరమైన కార్యక్రమాలు జరగనున్నాయి. దేదీప్యమానంగా ముచ్చింతల్ పరిసర ప్రాంతం మారబోతోంది.

తొలి రోజు కార్యక్రమాలలో భాగంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విష్వక్సేన వీధి శోధన, మధ్యాహ్నం ఒంటిగంట 30 నిమిషాలకు తీర్థ ప్రసాద గోష్టి నిర్వహించారు. ఆపై సాయంత్రం ఐదు గంటల నుండి ఐ 45 నిమిషాలు సామూహిక విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం నిర్వహించారు. ఆపై ఆరు గంటల నుండి ఎనిమిది గంటల 30 నిమిషాల వరకు వేదికపై అంకురార్పణ వైనతేయ ప్రతిష్ట, ఆపై తీర్థ ప్రసాద గోష్టి నిర్వహించబడింది.