Hyper Aadi : సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హైపర్ ఆది..

Kaburulu

Kaburulu Desk

December 9, 2022 | 03:15 PM

Hyper Aadi : సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హైపర్ ఆది..

Hyper Aadi : తెలుగు సూపర్ హిట్ కామెడీ షో “జబర్దస్త్” ద్వారా చాలామంది పాపులారిటీని సంపాదించుకున్నారు. అందులో ఒకడు ‘హైపర్ ఆది’. తన స్పాంటేనియస్‌తో అప్పటికప్పుడు పంచ్‌లు, సెటైర్‌లు వేస్తూ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాడు. ప్రతి స్కిట్‌లో ప్రేమ, పెళ్లి వంటి అంశాలను జోడించి డబుల్ మీనింగ్ డైలాగులతో ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాడు. ఆది స్పాంటేనియస్‌ నచ్చడంతో కొందరు దర్శకులు వారి సినిమాలకు కొన్ని కామెడీ సన్నివేశాలను రాయించుకుంటున్నారు.

Balakrishna : “స్వామి రామానుజాచార్య” పాత్రలో బాలయ్య?

అయితే ఈ స్టార్ కమెడియన్ గురించి సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక వార్త వైరల్‌గా మారింది. ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరికి చెప్పకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడు అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకు సంబంధించిన వీడియోని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అవి కాస్త వైరల్ కావడంతో, వాటిని చూసిన నెటిజెన్లు షాక్ కి గురవుతున్నారు.

అయితే విషయం ఏంటంటే.. గతంలో హైపర్ ఆది ఓ సినిమా షూటింగ్ లో భాగంగా ఓ పెళ్లి సన్నివేశంలో నటించాడు. ఆ దృశ్యానికి సంబంధించిన ఫొటోలను ఇప్పుడు కొందరు వైరల్ చేస్తున్నారు. కాబట్టి ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదు. అయితే జబర్దస్త్ స్టార్ సుధీర్, యాంకర్ ప్రదీప్ పెళ్లి గురించి కూడా ఇలానే వార్తలు వస్తున్నాయి. మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంతటి ఫేమ్ ని సంపాదించుకున్న ఈ ముగ్గురు ఎప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతారో అని అందరూ ఎదురుచూస్తున్నారు.