Balakrishna : బాలకృష్ణకు హీరోయిన్‌గా ప్రియాంక జవాల్కర్?

Kaburulu

Kaburulu Desk

December 6, 2022 | 12:15 PM

Balakrishna : బాలకృష్ణకు హీరోయిన్‌గా ప్రియాంక జవాల్కర్?

Balakrishna : అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా ఒక సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తతం అనిల్ రావిపూడి ప్రీ ప్రొడక్షన్స్ వర్క్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకొని.. సినిమాను అనుకున్న సమయంలో పూర్తీ చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ఈ సినిమా గురించి ఒక ఇంటరెస్టింగ్ టాపిక్ ఒకటి సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

Balakrishna : బాలయ్యబాబు మొదటి యాడ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ఆ డబ్బులతో ఏం చేశారో తెలిస్తే బాలయ్యని పొగడకుండా ఉండలేరు..

అదేంటంటే ఈ సినిమాలో బాలకృష్ణకు జోడిగా టాలీవుడ్ యంగ్ హీరోయిన్ ప్రియాంక జవాల్కర్ ని తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆమెపై టెస్ట్ ఫోటోషూట్ కూడా నిర్వహించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హాట్ హాట్ ఫోటోషూట్ లతో యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న ప్రియాంకని ఈ సినిమాకు ఎంపిక చేస్తే సినిమా గ్లామర్ మరింత పెరగడం ఖాయం. అయితే ఈ వార్తల్లో నిజమెంత ఉంది అనేది మాత్రం అధికారిక ప్రకటన వస్తే గాని తెలియదు.

ఇక ఈ సినిమాలో ఒక ముఖ్యపాత్ర కోసం చిత్ర యూనిట్.. పెళ్లిసందD ఫేమ్ ‘శ్రీలీల’ని తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ గురువారం నుంచి షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తుంది. తొలుత బాలకృష్ణపై ఫైట్ సీక్వెన్స్ తెరకెక్కించనున్నాడు దర్శకుడు రావిపూడి. సాహు గరిపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.