RRR Movie : RRR ఖాతాలో మరో అంతర్జాతీయ అవార్డు.. జపాన్ లోనూ RRR హవా..

ఇప్పటికే RRR సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు అనేక హాలీవుడ్ అవార్డుని గెలుచుకుంది. ఆస్కార్ టార్గెట్ గా రాజమౌళి ఈ సినిమాని హాలీవుడ్ లో మరింత ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో RRR సినిమా మరో అంతర్జాతీయ అవార్డు గెలుచుకుంది....................

Kaburulu

Kaburulu Desk

January 24, 2023 | 04:44 PM

RRR Movie : RRR ఖాతాలో మరో అంతర్జాతీయ అవార్డు.. జపాన్ లోనూ RRR హవా..

RRR Movie :  రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన RRR సినిమా ప్రపంచమంతా ప్రేక్షకులని మెప్పించిన సంగతి తెలిసిందే. హాలీవుడ్ ప్రేక్షకులనే కాక హాలీవుడ్ ప్రముఖ టెక్నీషియన్స్ ని కూడా RRR సినిమా మెప్పించింది. ఈ సినిమాని, దర్శకుడు రాజమౌళిని హాలీవుడ్ లోని టాప్ టెక్నీషియన్స్ అంతా అభినందిస్తున్నారు. ఇక ఈ సినిమా భారీ విజయం, కలెక్షన్స్ మాత్రమే కాదు అవార్డులు కూడా గెలుచుకుంటుంది.

ఇప్పటికే RRR సినిమా గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు అనేక హాలీవుడ్ అవార్డుని గెలుచుకుంది. ఆస్కార్ టార్గెట్ గా రాజమౌళి ఈ సినిమాని హాలీవుడ్ లో మరింత ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో RRR సినిమా మరో అంతర్జాతీయ అవార్డు గెలుచుకుంది. RRR సినిమాని ఇటీవల జపాన్ లో భారీగా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. రాజమౌళి, చరణ్, ఎన్టీఆర్ వెళ్లి మరీ సినిమాని ప్రమోట్ చేసి భారీగా రిలీజ్ చేశారు. జపాన్ ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. ఇక మన చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి పై వాళ్ళ ప్రేమని చూపించారు. మనకంటే ఎక్కువగా జపాన్ వాళ్ళు వీరిని దగ్గరికి తీసుకున్నారు. RRR సినిమా జపాన్ లో అత్యధిక వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాగా కూడా రికార్డు సృష్టించింది. కొన్ని రోజుల పాటు జపాన్ లో RRR ఫీవర్ నడిచిందంటే అర్ధం చేసుకోవచ్చు ఈ సినిమా అక్కడి ప్రేక్షకులని ఎంతగా మెప్పించిందో.

Rithu Chowdary : తండ్రి మరణం.. విషాదంలో సీరియల్ నటి.. నానా తిరిగి రా అంటూ ఎమోషనల్ పోస్ట్..

ఇప్పుడు ఏకంగా జపాన్‌ 46వ అకాడమీ అవార్డ్స్‌ లో అవుట్‌ స్టాండింగ్‌ ఫారిన్‌ ఫిల్మ్‌ కేటగిరిలో RRR సినిమా బెస్ట్ ఫిలిం అవార్డు గెలుచుకుంది. అవతార్‌ 2, టాప్‌గన్‌: మావెరిక్‌ లాంటి హాలీవుడ్‌ సినిమాలని దాటి మన RRR అవార్డు గెలుచుకుంది. దీంతో అభిమానులు, చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో ఈ అవార్డుని అందుకోనున్నారు చిత్రయూనిట్. ఇక ఆస్కార్ నామినేషన్స్ లో RRR పేరు కోసం ఎదురు చూస్తున్నారు చిత్రయూనిట్.