Rithu Chowdary : తండ్రి మరణం.. విషాదంలో సీరియల్ నటి.. నానా తిరిగి రా అంటూ ఎమోషనల్ పోస్ట్..

ఫ్యామిలీతో కలిసి సరదాగా ఇటీవల సంక్రాంతిని కూడా సెలబ్రేట్ చేసుకుంది. కానీ ఇంతలోనే రీతూ తండ్రి శేఖర్ గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు. తండ్రి మరణించడంతో ఒక్కసారిగా విషాదంలోకి వెళ్ళిపోయింది రీతూ. తన తండ్రితో కలిసి............

Kaburulu

Kaburulu Desk

January 24, 2023 | 04:27 PM

Rithu Chowdary : తండ్రి మరణం.. విషాదంలో సీరియల్ నటి.. నానా తిరిగి రా అంటూ ఎమోషనల్ పోస్ట్..

Rithu Chowdary :  ఇటీవల టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. పలువురు ప్రముఖులు, ప్రముఖుల కుటుంబ సభ్యులు మరణిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. సీరియల్స్ తో ఫేమ్ తెచ్చుకున్న రీతూ చౌదరి అనంతరం జబర్దస్త్, పలు టీవీ షోలతో మరింత పాపులారిటీ సాధించింది. ఇక యూట్యూబ్, సోషల్ మీడియాతో బాగా పాపులర్ అయింది రీతూ చౌదరి.

ఇటీవలే త్వరలో తన ప్రియుడ్ని కూడా పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ ప్రకటించింది రీతూ. ఫ్యామిలీతో కలిసి సరదాగా ఇటీవల సంక్రాంతిని కూడా సెలబ్రేట్ చేసుకుంది. కానీ ఇంతలోనే రీతూ తండ్రి శేఖర్ గుండెపోటుతో హఠాత్తుగా మరణించారు. తండ్రి మరణించడంతో ఒక్కసారిగా విషాదంలోకి వెళ్ళిపోయింది రీతూ. తన తండ్రితో కలిసి సంక్రాంతికి దిగిన చివరి ఫోటోని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి.. మిస్ యు నాన్న. ఈ ఫోటో మీతో దిగినప్పుడు ఇలా పోస్ట్ చేయాల్సి వస్తుంది అనుకోలేదు. లాస్ట్ పిక్ మీతో. నన్ను వదిలేసి ఎలా వెళ్ళిపోయావు నాన్న. నువ్వు లేకుండా నేను ఉండలేను. ఒక్కసారి తిరిగి రా నీ కూతురి దగ్గరికి ప్లీజ్ నాన్న అంటూ ఎమోషనల్ గా పోస్ట్ పెట్టింది.

Pawan Kalyan: కొండగట్టులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వారాహీకి ప్రత్యేక పూజలు

రీతూ చౌదరి తండ్రి మరణించాడని తెలియడంతో పలువురు టీవీ, సోషల్ మీడియా ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియచేస్తున్నారు.