NTR 30 Update : NTR 30 సినిమా రిలీజ్ డేట్ అనౌన్సమెంట్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..

తాజాగా న్యూ ఇయర్ మొదటి రోజున NTR 30 సినిమా అప్డేట్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు చిత్ర యూనిట్. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా కొరటాల శివ దర్శకత్వంలో NTR 30 సినిమా తెరకెక్కుతుంది. న్యూ ఇయర్ కానుకగా NTR 30 సినిమాని..................

Kaburulu

Kaburulu Desk

January 1, 2023 | 02:59 PM

NTR 30 Update : NTR 30 సినిమా రిలీజ్ డేట్ అనౌన్సమెంట్.. పండగ చేసుకుంటున్న ఫ్యాన్స్..

NTR 30 Update :  ఎన్టీఆర్ మార్చ్ లో రామ్ చరణ్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో RRR సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమాలో తన అద్భుతమైన నటనతో మరోసారి అందర్నీ మెప్పించాడు ఎన్టీఆర్. ఈ సారి టాలీవుడ్ ని మాత్రమే కాదు దేశమంతటా, హాలీవుడ్ ప్రేక్షకులని కూడా ఎన్టీఆర్ మెప్పించాడు. ఈ సినిమాతో ఎన్టీఆర్ కి పాన్ ఇండియా గుర్తింపు కూడా వచ్చింది.

RRR సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల దర్శకత్వంలో ఒక సినిమా, KGF డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఇంకో సినిమాని అనౌన్స్ చేశాడు. సినిమాలు అనౌన్స్ చేసినా వాటి షూటింగ్స్ మొదలుపెట్టలేదు. వాటి నుంచి ఎలాంటి అప్డేట్స్ కూడా ఇవ్వలేదు. NTR 30 సినిమా నుంచి మాత్రం ఒక మోషన్ పోస్టర్ వదిలి, ఒక వాయిస్ ఓవర్ ని ఇచ్చారు. దీంతో ఈ సినిమా పక్కా మాస్ గా ఉండబోతుందని సినిమాపై భారీగా అంచనాలు పెంచేసుకున్నారు అభిమానులు.

Poorna : తల్లి కాబోతున్నాను అంటూ వీడియో రిలీజ్ చేసిన నటి పూర్ణ..

తాజాగా న్యూ ఇయర్ మొదటి రోజున NTR 30 సినిమా అప్డేట్ ఇచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు చిత్ర యూనిట్. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా కొరటాల శివ దర్శకత్వంలో NTR 30 సినిమా తెరకెక్కుతుంది. న్యూ ఇయర్ కానుకగా NTR 30 సినిమాని 2024 ఏప్రిల్ 5న రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు చిత్ర యూనిట్. అలాగే ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనున్నట్టు తెలిపారు. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులకి న్యూ ఇయర్ కానుక ఇచ్చారని సంబర పడుతున్నారు. అయితే కొంతమంది మాత్రం ఇప్పటికే తారక్ తెరపై కనపడి 9 నెలలు అవుతుంది, ఇంకా 15 నెలలు ఆగాలా అని నిరాశ చెందుతున్నారు. ఆచార్యతో ఫ్లాప్ తెచ్చుకున్న కొరటాల శివ ఈ సినిమాతో గట్టిగా హిట్ కొట్టాలని చూస్తున్నాడు.