Poorna : తల్లి కాబోతున్నాను అంటూ వీడియో రిలీజ్ చేసిన నటి పూర్ణ..

పూర్ణ మలయాళ భామ కావడంతో కొన్ని నెలల క్రితం తన సొంతరాష్ట్రం అయిన కేరళకి చెందిన షానిద్ ఆసిఫ్ అలీని వివాహం చేసుకుంది. షానిద్ ఆసిఫ్ అలీ ప్రస్తుతం దుబాయ్ లో ప్రముఖ వ్యాపార వేత్తగా కొనసాగుతున్నాడు. దీంతో పూర్ణ వివాహం కూడా దుబాయిలోనే ఘనంగా జరిగింది. తాజాగా తాను...........

Kaburulu

Kaburulu Desk

December 31, 2022 | 02:21 PM

Poorna : తల్లి కాబోతున్నాను అంటూ వీడియో రిలీజ్ చేసిన నటి పూర్ణ..

Poorna :  మలయాళంలో ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన షామ్నా ఖాసీం అనంతరం పూర్ణగా పేరు మార్చుకొని హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. తెలుగులో సీమ టపాకాయ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో హీరోయిన్ గా మెప్పించింది. ప్రస్తుతం సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూనే పలు టీవీ షోలలో జడ్జిగా కూడా అలరిస్తుంది.

పూర్ణ మలయాళ భామ కావడంతో కొన్ని నెలల క్రితం తన సొంతరాష్ట్రం అయిన కేరళకి చెందిన షానిద్ ఆసిఫ్ అలీని వివాహం చేసుకుంది. షానిద్ ఆసిఫ్ అలీ ప్రస్తుతం దుబాయ్ లో ప్రముఖ వ్యాపార వేత్తగా కొనసాగుతున్నాడు. దీంతో పూర్ణ వివాహం కూడా దుబాయిలోనే ఘనంగా జరిగింది. తాజాగా తాను తల్లి కాబోతున్నట్టు ప్రకటించింది పూర్ణ.

Waltair Veerayya : వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బాలయ్య?

దీనికి సంబంధించిన ఓ వీడియో తీసి తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో పూర్ణ తాను తల్లి కాబోతున్నాను అని ప్రకటించి తన పేరెంట్స్, బంధుమిత్రులు, కుటుంబ సభ్యులతో సంతోషాన్ని పంచుకుంటూ సెలబ్రేట్ చేసుకుంది. పూర్ణ తల్లి కాబోతున్నాను అని ప్రకటించడంతో పలువురు ప్రముఖులు ఆమెకి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.