Waltair Veerayya : వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బాలయ్య?

Kaburulu

Kaburulu Desk

December 30, 2022 | 05:12 PM

Waltair Veerayya : వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి బాలయ్య?

Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మాస్ యాక్షన్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. కె బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పక్కా మాస్ కమర్షియల్ హంగులతో తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా శృతిహాసన్ నటిస్తుంది. మాస మహారాజ్ రవితేజ ఒక అతిధి పాత్రలో కనిపించబోతున్నాడు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

Chiranjeevi : మళ్ళీ అదే దారిలో వెళుతున్న చిరంజీవి..

కాగా ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక అదిరిపోయే న్యూస్ బయటకి వచ్చింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జనవరి 4న విశాఖపట్నంలో నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా బాలకృష్ణ రాబోతున్నాడు అని ఒక వార్త సినీవర్గాల్లో వినిపిస్తుంది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

అలాగే బాలకృష్ణ వీరసింహారెడ్డిని కూడా మైత్రీ వాళ్లే ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతి బరిలో నిలుస్తుండటంతో, నిర్మాతలు.. ఆడియన్స్ ని రెండు సినిమాలని ఆదరించేలా ఈ ప్లాన్ వేసినట్లు తెలుస్తుంది. అయితే ఈ వార్త గురించి ఎటువంటి అధికారిక ప్రకటన బయటకి రాలేదు. మరి చూడాలి వీరయ్య కోసం వీరసింహుడు నిజంగానే వస్తాడా అనేది.