Pavitra-Naresh : పవిత్రా లోకేష్‌కి లిప్ కిస్ ఇచ్చిన నరేష్.. పెళ్లి చేసుకోబోతున్నామంటూ సంచలన ప్రకటన..

తాజాగా నరేష్ పవిత్రని పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు. ఈ మేరకి నరేష్ తన ట్విట్టర్ లో ఓ వీడియోని పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో నరేష్, పవిత్రా కలిసి కేక్ కట్ చేసి తినిపించుకొని...........

Kaburulu

Kaburulu Desk

December 31, 2022 | 02:26 PM

Pavitra-Naresh : పవిత్రా లోకేష్‌కి లిప్ కిస్ ఇచ్చిన నరేష్.. పెళ్లి చేసుకోబోతున్నామంటూ సంచలన ప్రకటన..

Pavitra-Naresh :  సీనియర్ నటుడు నరేష్ గత కొన్ని నెలలుగా వివాదాల్లో, వార్తల్లో, సోషల్ మీడియాలో ఉంటున్నాడు. అతని మూడో భార్య రమ్యతో గొడవలు, నటి పవిత్రా లోకేష్ తో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ మూడో భార్యకి దొరకడం, నటి పవిత్రాతో అన్ని చోట్లకి తిరిగేయడంతో కొన్ని రోజుల పాటు వార్తల్లో నిలిచారు నరేష్. ఇక సోషల్ మీడియాలో అయితే ట్రోలర్స్, మీమర్స్ నరేష్-పవిత్రా జంటని ఆడేసుకున్నారు.

కొన్ని రోజుల క్రితం నరేష్, పవిత్రా దీనిపై స్పందిస్తూ మా మీద తప్పుడు కథనాలు రాస్తున్నారంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్, సైట్స్ మీద సైబర్ పోలీసులకి ఫిర్యాదు కూడా ఇచ్చారు. ఇటీవల కృష్ణ మరణించిన సమయంలో కూడా నరేష్ పవిత్రాతో కలిసి వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. తాజాగా నరేష్ పవిత్రని పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు.

Poorna : తల్లి కాబోతున్నాను అంటూ వీడియో రిలీజ్ చేసిన నటి పూర్ణ..

ఈ మేరకి నరేష్ తన ట్విట్టర్ లో ఓ వీడియోని పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో నరేష్, పవిత్రా కలిసి కేక్ కట్ చేసి తినిపించుకొని లిప్ కిస్ ఇచ్చుకున్నారు. హ్యాపీ న్యూ ఇయర్ చెప్తూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాం అని ప్రకటించారు. అలాగే ఈ వీడియోని షేర్ చేస్తూ కొత్త సంవత్సరం, కొత్త బంధాలు మొదలుపెడుతున్నాం, మీ ఆశీర్వాదాలు కావాలి అని ట్వీట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. మరోసారి నరేష్, పవిత్రా సోషల్ మీడియాలో, వార్తల్లో ట్రెండింగ్ లో ఉన్నారు. దీనిపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా కామెంట్స్ చేస్తున్నారు.