RRR : గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెల్చుకున్నందుకు.. RRR పై సినీ, రాజకీయ ప్రముఖుల ప్రశంసలు..

RRR లోని 'నాటు నాటు' సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుని గెలుచుకుంది. దీంతో ఆర్ఆర్ఆర్ టీంకి సినీ, రాజకీయ నాయకుల నుంచి ప్రశంసల జల్లు వెల్లువెత్తుతోంది. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ..

Kaburulu

Kaburulu Desk

January 11, 2023 | 12:49 PM

RRR : గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెల్చుకున్నందుకు.. RRR పై సినీ, రాజకీయ ప్రముఖుల ప్రశంసలు..

RRR : రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికి తెలుసు. ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ నటన విశ్వరూపం చూపించారు. ముఖ్యంగా ఈ మూవీలోని ‘నాటు నాటు’ సాంగ్ వరల్డ్ వైడ్ మ్యూజిక్ లవర్స్ ని ఉర్రూతలూగించింది. ఈ సాంగ్ లో ఎన్టీఆర్ అండ్ చరణ్ వేసిన స్టెప్ లు చూసిన ప్రతి ఒక్కరికి పూనకాలు రావాల్సిందే.

Breaking : Golden Globe Award :  అత్యంత ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు సొంతం చేసుకున్న RRR..

ఎం ఎం కీరవాణి ఈ సాంగ్ ని కంపోజ్ చేశాడు. ఈ పాటని రెడీ చేయడానికి కీరవాణికి 19 నెలలు సమయం పట్టింది అంటా. ఇంత హిట్టు అయిన ఈ సాంగ్ ప్రతిష్టాత్మకమైన ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ రేస్ లో నిలిచింది. తాజాగా ఈ సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ లో బెస్ట్ సాంగ్ అవార్డుని అందుకుంది. దీంతో ఆర్ఆర్ఆర్ టీంకి సినీ, రాజకీయ నాయకుల నుంచి ప్రశంసల జల్లు వెల్లువెత్తుతోంది.

ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోడీ, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, నారా చంద్రబాబు నాయడు, మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, రామ్ పోతినేని, రష్మిక మందన, ఏ ఆర్ రెహమాన్, దేవిశ్రీ ప్రసాద్, గీత రచయిత చంద్రబోస్.. మరి కొంతమంది సినీ, రాజకీయ ప్రముఖులు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలియజేశారు.