Home » Author » M N
Telangana High Court: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తెలంగాణలో కొద్ది నెలలుగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారంటూ తెలంగాణ ప్రభుత్వం నాటి ఆడియోలు, వీడియోలను అన్ని పార్టీల అధ్యక్షులు, న్యాయమూర్తులకు పంపింది. దీంతో ఇది రాజకీయంగా పెద్ద దుమారమే చెలరేగింది. ఇందులో బీజేపీ నేతల ప్రోత్సహం ఉందంటూ.. కొందరు బీజేపీ నేతల పేర్లు తెరపైకి వచ్చాయి. ఈ కేసు విచారణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా సిట్ ఏర్పాటు చేశారు. కాగా, ఇప్పుడు […]
V. V. Lakshminarayana: బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా ఇప్పటికే ఏపీలో రిటైర్డ్ అధికారులకు గాలిమేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తోట చంద్రశేఖర్, రావెళ్ల కిషోర్ తో పాటు మరి కొందరిని పార్టీలోకి చేర్చుకొని పదవులు అప్పగించిన కేసీఆర్.. మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణకు కూడా ఆహ్వానం పలికారని.. ఆయన కూడా అందుకు సుముఖంగా ఉన్నారని.. వచ్చే ఎన్నికలలో విశాఖ పార్లమెంట్ నుండి లక్ష్మీనారాయణ బీఆర్ఎస్ నుండి రంగంలో దిగనున్నారని జోరుగా ప్రచారం జరుగుతుంది. కాగా, దీనిపై […]
Telangana Budget 2023: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ వార్షిక బడ్జెట్‌ను మంత్రి హరీశ్ రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. రూ.2,90,396 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రతిపాదించగా.. రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లుగా.. పెట్టుబడి వ్యయం రూ.37,525 కోట్లుగా పేర్కొన్నారు. శాసనసభలో హరీశ్ రావు, శాసన మండలిలో శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. తొలిసారిగా సభ్యులందరికీ పెన్ డ్రైవ్‌ల ద్వారా బడ్జెట్ కాపీలను అందించారు. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ […]
BRS Party-Bandi Sanjay: మహారాష్ట్రలోని నాందేడ్ లో బీఆర్ఎస్ నిర్వహించిన జాతీయ సభ అట్టర్ ప్లాప్ అయిందని, మహారాష్ట్ర జనం అసలు పట్టించుకోలేదన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. ఈ మేరకు బీఆర్ఎస్ సభపై బండి సంజయ్ హైదరాబాద్ లో ఓ ప్రకటన విడుదల చేశారు. 30 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎంపీలు 25 రోజులుగా నాందేడ్ లోనే మకాం వేసి ఏర్పాట్లు చేసినా బీఆర్ఎస్ సభ తుస్సు మందన్నారు. ఈ […]
Swami Ramdev: యోగా గురువు బాబా రాందేవ్ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. హిందూ మహిళల్ని అపహరిస్తున్నారంటూ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. జైపూర్‌లోని బర్మెర్‌లో జరిగిన సాధువుల సమావేశంతో పాటు తాజాగా రాజస్థాన్ లోని బార్మర్ లో జరిగిన పీఠాధిపతుల సమావేశంలో ఆయన ఈ విధంగా మాట్లాడారు. ముస్లింలు విద్వేష వ్యాప్తి చేస్తున్నారని చెప్తూనే హిందూయిజాన్ని ఇస్లాం, క్రైస్తవంతో పోలుస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మంచి చేయమని హిందూ మతం చెబుతుందని, […]
YSRCP-Janasena: ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా ఏపీలో రాజకీయాలు మాత్రం రేపే ఎన్నికలు అన్నట్లుగా ఉన్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒకవైపు టీడీపీ, వైసీపీ మధ్య ప్రత్యక్ష మాటల దాడి జరుగుతుంటే.. మరోవైపు వైసీపీ-జనసేన మధ్య లేఖల యుద్ధం నడుస్తుంది. ఐటీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, కాపు ఉద్యమ నేత చేగొండి హరిరామజోగయ్య మధ్య లెటర్ వార్ జరుగుతోంది. లేఖలతోనే ఈ ఇద్దరూ పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నారు. అమర్నాథ్‌పై కాపు ఉద్యమ నాయకుడు, […]
Jagga Reddy: నేను కాంగ్రెస్ లో ఉన్నా.. కాంగ్రెస్ కంటే బీజేపీ చరిత్ర నాకు బాగా తెలుసు.. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలలో గవర్నర్ ప్రసంగంపై బీజేపీ అసంతృప్తిలో ఉంది. అందుకే త్వరలోనే గవర్నర్ ను మార్చవచ్చని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్న గవర్నర్ ప్రసంగం అనంతరం మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి గవర్నర్ బయట చాలా నరికారని.. పులి తీరుగా గాండ్రించారని.. కానీ పిల్లి తీరుగా సభలో ప్రసంగించారని ఎద్దేవా చేశారు. కాగా.. ఆదివారం మరోసారి […]
Kotamreddy Sridhar Reddy: రాష్ట్ర రాజకీయాలలో నెల్లూరు పాలిటిక్స్ వేరయా అన్నట్లుగా సాగుతుంది ఏపీలో వ్యవహారం. రెబల్ ఎమ్మెల్యేల కామెంట్స్ రాష్ట్రంలో కాక రేపుతోన్నాయి. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జగన్ సర్కార్‌పై ఒంటికాలిపై లేస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా పార్టీ ఇంచార్జి బాధ్యతల నుండి తప్పించగా.. తాజాగా కోటంరెడ్డి భద్రతను కూడా ప్రభుత్వం తగ్గించిన సంగతి తెలిసిందే. కోటంరెడ్డికి ఉన్న నలుగురు గన్ మెన్లలో ఇద్దరు గన్ మెన్లను ప్రభుత్వం రీ కాల్ చేసింది. […]
Unstoppable with NBK: పాపం బాలయ్య మరో కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. మొన్నామధ్య అక్కినేని తొక్కినేని అంటూ చేసిన వ్యాఖ్య ఒకటి రచ్చ రచ్చ కాగా.. అక్కినేని అభిమానులు బాలయ్య క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్లు చేశారు. అక్కినేని హీరోలు కూడా సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. చివరికి తన ఉద్దేశం అది కాదని.. ఫ్లోలో మాట్లాడేశానని బహిరంగ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అదలా ఉండాగానే ఇప్పుడు మరో కొత్త వివాదంలో చిక్కుకున్నాడు. తాజాగా బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో […]
BRS Party: దేశంలో మార్పు రావాల్సిన సమయం వచ్చింది. మారుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని బీఆర్ఎస్ పెట్టానని తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడారు. నాందేడ్ బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్.. అబ్ కీ బార్ కిసాన్‌కి సర్కార్ అనేది బీఆర్ఎస్ తొలి నినాదం. దేశంలో తాగు, సాగు నీటికి తీవ్ర కొరత ఉంది. రైతు ప్రభుత్వం ఏర్పడితేనే నీటి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు. మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని.. అన్నదాత […]