Manushi Chillar : మెగా హీరో సినిమాలో మాజీ విశ్వసుందరి.. రియల్ ఇన్సిడెంట్స్ తో సినిమా..
తాజాగా వరుణ్ తేజ్ 13వ సినిమాలో హీరోయిన్ ని ప్రకటించారు. మాజీ విశ్వా సుందరి, బాలీవుడ్ భామ మానుషి చిల్లర్ ఈ సినిమాలో వరుణ్ తేజ్ కి జంటగా నటించబోతుంది. మానుషికి ఇది..................

Manushi Chillar : మెగా హీరో వరుణ్ తేజ్ వరుసగా సినిమా ఫలితంతో సంబంధం లేకుండా కొత్త కొత్త కథలతో ప్రేక్షకులని అలరించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడున్న యువ మెగా హీరోల్లో కొత్త కొత్త కథలతో వస్తుంది వరుణ్ తేజ్ ఒక్కడే. వరుణ్ తేజ్ గత సినిమా గని పరాజయం పాలైంది. ప్రస్తుతం వరుణ్ తేజ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.
వరుణ్ తేజ్ ప్రవీణ్ సత్తారు డైరెక్షన్ లో గాండీవదారి అర్జున అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ 13వ సినిమా ఇటీవల కొన్నిరోజుల క్రితం ప్రకటించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రియల్ గా జరిగిన ఓ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనున్నట్టు గతంలోనే ప్రకటించారు.
తాజాగా వరుణ్ తేజ్ 13వ సినిమాలో హీరోయిన్ ని ప్రకటించారు. మాజీ విశ్వా సుందరి, బాలీవుడ్ భామ మానుషి చిల్లర్ ఈ సినిమాలో వరుణ్ తేజ్ కి జంటగా నటించబోతుంది. మానుషికి ఇది మొదటి తెలుగు సినిమా. అలాగే త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టనున్నట్టు తెలిపారు. మరి మానుషి, వరుణ్ తేజ్ ఈ సరికొత్త కథతో ప్రేక్షకులని ఎలా మెప్పిస్తారో చూడాలి. ఈ సినిమాని గని సినిమా నిర్మాతలు సోని పిక్చర్స్ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాని కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నాడు.
We are on a journey to celebrate the Pride & Glory of the IAF🇮🇳
Team #VT13 Welcomes Aboard @ManushiChhillar to join the force💥
Shoot Begins❤️🔥🌟ing @IAmVarunTej@ShaktipsHada89 @dophari @sidhu_mudda @nandu_abbineni @RenaissancePicz @khanwacky @sonypicsfilmsin @SonyPicsIndia pic.twitter.com/XiQ5tVaEIO
— Renaissance Pictures (@RenaissancePicz) March 3, 2023