Manushi Chiller : రాజమౌళి సినిమాలో ఛాన్స్ కావాలంటున్న మాజీ మిస్ వరల్డ్..

మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ కూడా 2022 లో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సామ్రాట్ పృథ్విరాజ్ లో హీరోయిన్ గా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మెప్పించింది. ఈ సినిమా ఫ్లాప్ అయినా మానుషీకి మంచి మార్కులే పడ్డాయి. ఇది పీరియాడికల్ సినిమా కావడంతో మానుషీకి.............

Kaburulu

Kaburulu Desk

January 2, 2023 | 01:55 PM

Manushi Chiller : రాజమౌళి సినిమాలో ఛాన్స్ కావాలంటున్న మాజీ మిస్ వరల్డ్..

Manushi Chiller :  మోడలింగ్ రంగంలో ఎంట్రీ ఇచ్చి మోడల్ గా పలు ఈవెంట్స్ లో పాల్గొని మోడలింగ్ లో రాణిస్తూ మిస్ ఇండియా, మిస్ వరల్డ్ టైటిల్స్ గెలుచుకుంది మానుషీ చిల్లర్. 2017 లో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకుంది మానుషీ చిల్లర్. ప్రపంచ సుందరి కిరీటాన్ని ఇండియాకి తీసుకొచ్చింది. మోడలింగ్ లో ఇలా సక్సెస్ అయి కిరీటాలు గెలుచుకున్న వాళ్ళు చాలా మంది ఆఫర్స్ వస్తే కచ్చితంగా సినిమాల్లోకి వస్తారు.

మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ కూడా 2022 లో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన సామ్రాట్ పృథ్విరాజ్ లో హీరోయిన్ గా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి మెప్పించింది. ఈ సినిమా ఫ్లాప్ అయినా మానుషీకి మంచి మార్కులే పడ్డాయి. ఇది పీరియాడికల్ సినిమా కావడంతో మానుషీకి తనలో ఉన్న కమర్షియల్ అంశాలని బయటపెట్టే ఛాన్స్ రాలేదు. ప్రస్తుతం మానుషీ మరో రెండు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తుంది. వీటిల్లో కమర్షియల్ హీరోయిన్ గా చేస్తోంది.

తాజాగా మానుషీ చిల్లర్ ఓ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజమౌళి సినిమాలో నటించాలని ఉంది అని తెలిపింది. బాహుబలితో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న రాజమౌళి ఇటీవల RRR సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దీంతో రాజమౌళి సినిమాల్లో నటించాలని చాలామంది స్టార్స్ కూడా ఎదురు చూస్తున్నారు.

Avatar 2 : ‘అవతార్ 2’ని కట్ చేసిన జేమ్స్ కామెరూన్.. పది నిమిషాల సీన్స్ తీసేశాడట..

తాజాగా మానుషీ చిల్లర్ బాలీవుడ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చాలా మంది ఫలానా డైరెక్టర్స్ సినిమాల్లో నటిస్తే బాగుంటుంది అని భావిస్తారు. నేనైతే ఏదయినా మంచి సినిమా చూస్తే, అది నాకు బాగా నచ్చితే ఆ డైరెక్టర్ సినిమాలో చేయాలనుకుంటాను. RRR సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఆ సినిమా డైరెక్టర్ రాజమౌళి సినిమాలో నటించాలని కోరుకుంటున్నాను. రాజమౌళి నుంచి ఛాన్స్ వస్తే నో చెప్పను అని తెలిపింది. దీంతో బాలీవుడ్ లో రాజమౌళి సినిమాలో నటించాలనుకునేవాళ్ళ జాబితాలో ఈ మాజీ ప్రపంచ సుందరి జాయిన్ అయింది.