Mahesh Babu Foundation : ఇకపై మీరు కూడా మహేష్ బాబు ఫౌండేషన్ కి డొనేట్ చేయొచ్చు.. మొదటి విరాళం ఇచ్చిన సితార..

మహేష్ తాజాగా ఈ మంచి పనుల్లో మరింతమందిని భాగం చేయాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు ఫౌండేషన్ వెబ్ సైట్ ని స్థాపించారు. ఈ వెబ్ సైట్ ని మహేష్ కూతురు సితార లాంచ్ చేసింది..............

Kaburulu

Kaburulu Desk

January 2, 2023 | 02:14 PM

Mahesh Babu Foundation : ఇకపై మీరు కూడా మహేష్ బాబు ఫౌండేషన్ కి డొనేట్ చేయొచ్చు.. మొదటి విరాళం ఇచ్చిన సితార..

Mahesh Babu Foundation :  సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా ఎన్నో మంచిపనులతో, ఎంతోమంది పిల్లలకి ప్రాణదానం చేసి హీరోగా నిలుస్తున్నారు. మహేష్ బాబు ఫౌండేషన్ స్థాపించి ఆంధ్ర హాస్పిటల్స్ భాగస్వామ్యంతో ఇప్పటికే దాదాపు 1000 మందికి పైగా పిల్లలకి ఫ్రీగా హార్ట్ ఆపరేషన్స్ చేయించి బతికించాడు మహేష్. ఇలా 1000 మందికి పైగా చిన్నారులకి ప్రాణాలు పోసి ఆ కుటుంబాలకి దేవుడయ్యాడు.

ఇలా పిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ మాత్రమే కాకుండా పలు గ్రామాల్లో సేవా కార్యక్రమాలు, మెడికల్ క్యాంప్స్ కూడా నిర్వహిస్తున్నాడు మహేష్. తాజాగా ఈ మంచి పనుల్లో మరింతమందిని భాగం చేయాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు ఫౌండేషన్ వెబ్ సైట్ ని స్థాపించారు. ఈ వెబ్ సైట్ ని మహేష్ కూతురు సితార లాంచ్ చేసింది. https://www.maheshbabufoundation.org/ పేరుతో ఈ వెబ్ సైట్ ని ప్రారంభించారు.

కొత్త సంవత్సరం నాడు ఈ సైట్ లాంచ్ అనంతరం సితార మాట్లాడుతూ.. ఇన్ని రోజులు నాన్న చేసే మంచిపనుల్లో భాగమవ్వాలనుకున్నాను. ఇలా ఈ రోజు భాగమవుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఈ మంత్ నా పాకెట్ మనీ మొత్తం నాన్న ఫౌండేషన్ కి విరాళంగా ఇస్తున్నాను అని తెలిపింది. ఈ సైట్ ద్వారా మహేష్ బాబు ఫౌండేషన్ కి విరాళాలు ఇవ్వాలనుకున్నవాళ్ళు డొనేట్ ఆప్షన్ నుంచి ఇవ్వొచ్చు. అలాగే ఎవరికైనా పిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ కావాలంటే కూడా ఈ సైట్ నుంచి రిక్వెస్ట్ పెట్టొచ్చు. మరింతమందిని మహేష్ బాబు చేసే మంచిపనిలో భాగం చేస్తున్నందుకు మరోసారి అభిమానులు, నెటిజన్లు ఆయన్ని అభినందిస్తున్నారు.