Avatar 2 : ‘అవతార్ 2’ని కట్ చేసిన జేమ్స్ కామెరూన్.. పది నిమిషాల సీన్స్ తీసేశాడట..

అవతార్ 2 సినిమా దాదాపు 3 గంటలకి పైగా నిడివి ఉండటంతో చాలా మందికి కొన్ని సన్నివేశాల్లో సినిమా బోర్ అనిపించింది. తాజాగా అవతార్ 2 సినిమా నుంచి దాదాపు 10 నిముషాలు కట్ చేశామని దర్శకుడు..............

Kaburulu

Kaburulu Desk

January 2, 2023 | 01:33 PM

Avatar 2 : ‘అవతార్ 2’ని కట్ చేసిన జేమ్స్ కామెరూన్.. పది నిమిషాల సీన్స్ తీసేశాడట..

Avatar 2 : పదేళ్ల క్రితం రిలీజయిన భారీ విజువల్ వండర్ సినిమా అవతార్ కు సీక్వెల్ గా అవతార్ 2 ఇటీవలే ప్రపంచవ్యాప్తంగా రిలీజయింది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన అవతార్ 2 సినిమా డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజయి మంచి విజయం సాధించింది. ఇప్పటికే అవతార్ 2 సినిమా 1.3 బిలియన్ డాలర్స్ కలెక్షన్స్ సాధించి 2 బిలియన్ డాలర్స్ టార్గెట్ గా పెట్టుకుంది.

అవతార్ 2 సినిమా కూడా విజువల్స్, గ్రాఫిక్స్ అద్భుతంగా ఉన్నా కథ పరంగా మాత్రం అంత స్ట్రాంగ్ గా లేదు. అలాగే అవతార్ 2 సినిమా దాదాపు 3 గంటలకి పైగా నిడివి ఉండటంతో చాలా మందికి కొన్ని సన్నివేశాల్లో సినిమా బోర్ అనిపించింది. తాజాగా అవతార్ 2 సినిమా నుంచి దాదాపు 10 నిముషాలు కట్ చేశామని దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెలిపాడు.

samantha : రిలీజ్ కి రెడీ అయిన సమంత శాకుంతలం.. మరో హిట్ కొడుతుందా??

ఓ హాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో జేమ్స్ కామెరూన్ మాట్లాడుతూ.. అవతార్ 2 సినిమాలో వయొలెన్స్, గన్ ఫైటింగ్ దృశ్యాలని తగ్గించాలనే ఉద్దేశంతో సినిమాలో 10 నిమిషాల సీన్స్ ని కట్ చేసి నిడివి తగ్గించాం. యాక్షన్ సన్నివేశాలని తగ్గించాలంటే డైరెక్టర్స్ కి మనసొప్పదు. కానీ మరీ బోరింగ్ గా ప్రేక్షకుడికి అనిపించకూడదు కాబట్టి సినిమాలో 10 నిమిషాల యాక్షన్ సీన్స్ ని కట్ చేశాం అని తెలిపాడు. దీంతో ప్రస్తుతం అవతార్ 2 సినిమా అంతకుముందు కంటే 10 నిమిషాల నిడివి తగ్గి ప్రదర్శింపబడుతుంది.