NTR : అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో అభిమానుల పై ఎన్టీఆర్ ఆగ్రహం..
అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిధిగా హాజరయ్యిన ఎన్టీఆర్.. ఫ్యాన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. NTR30 అప్డేట్ ఇవ్వాలి అంటూ అభిమానులు గోల చేయడంతో..

NTR : నందమూరి కళ్యాణ్ రామ్ సినిమా, సినిమాకి వైవిద్యం చూపిస్తూ హిట్టు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. ‘బింబిసార’ వంటి సోషియో ఫాంటసీ స్టోరీతో కమర్షియల్ హిట్టుని సొంతం చేసుకున్న కళ్యాణ్ రామ్.. ఇప్పుడు మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమయ్యాడు. ‘అమిగోస్’ అనే టైటిల్ ని పెట్టుకున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఫిబ్రవరి 10న విడుదల కాబోతున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ ఆదివారం హైదరాబాద్ JRC కన్వెన్షన్ లో జరిగింది.
NTR30 : NTR30 అప్డేట్ ఇచ్చిన ఎన్టీఆర్.. షూటింగ్ అండ్ రిలీజ్ డేట్ అనౌన్స్!
ఈ ఈవెంట్ కి జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఇక ఈ ఫంక్షన్ లో ఫ్యాన్స్ NTR30 అప్డేట్ ఇవ్వాలి అంటూ గోల చేశారు. దీంతో ఎన్టీఆర్ స్పందిస్తూ.. ‘ఇది మిమ్మల్ని బాధ పెట్టాలని మాట్లాడడం లేదు. ఒకసారి నేను చెప్పేది వినండి. సినిమాలు చేస్తున్నప్పుడు ఒకొక్కసారి అప్డేట్స్ ఇవ్వడానికి ఏమి ఉండవు. మీ ఆరాటం, ఉత్సాహం అర్ధమవుతుంది. కానీ ప్రతిసారి అప్డేట్ ఇవ్వాలి అంటే చాలా కష్టమైన పని. పోనీ ఏది పడితే అది అప్డేట్ ఇస్తే, మీరు ఊరుకుంటారా? తిరిగి తిడతారు. దాని వల్ల దర్శక నిర్మాతల పై ప్రెజర్ పడుతుంది. ఏమన్నా అప్డేట్ ఉంటే మా ఇంటిలో వాళ్ళకంటే ముందే మీకు చెప్పుకుంటాం.
అది కూడా అదిరిపోయే అప్డేట్ మాత్రమే చెబుతాము. ఇది కేవలం మా టీం మాత్రమే పేస్ చేస్తున్న ప్రాబ్లం కాదండి. ప్రతి ఒక్కరు ఇదే ప్రెజర్ కి గురవుతున్నారు. కాబట్టి మీరు ఎక్కడెక్కడో చదివిన వార్తలను మనసుకి తీసుకోని, ఆ ప్రెజర్ ని దయచేసి దర్శక నిర్మాతల పై చూపించకండి’ అంటూ వ్యాఖ్యానించాడు. అలాగే అభిమానులను కొంత సంతోష పరుస్తూ NTR30 షూటింగ్ అప్డేట్ ని ఇచ్చాడు. ఈ నెలలో మూవీ ఓపెనింగ్ జరుగుతుందని, వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్ కి వెళుతుంది అంటూ వెల్లడించాడు.