NTR30 : NTR30 అప్డేట్ ఇచ్చిన ఎన్టీఆర్.. షూటింగ్ అండ్ రిలీజ్ డేట్ అనౌన్స్!
కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ హాజరు అవ్వగా, ఫ్యాన్స్ NTR30 అప్డేట్ ఇవ్వాలి అంటూ గోల చేశారు. దీనికి ఎన్టీఆర్ స్పందిస్తూ..

NTR30 : ఆర్ఆర్ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ పాపులారిటీ సంపాదించుకున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాతో
ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్ కి లైన్ క్లియర్ అయ్యింది. ఇక నుంచి వచ్చిన ఫేమ్ ని పెంచుకుంటూ వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నాడు ఎన్టీఆర్. దీంతో తన తదుపరి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఎన్టీఆర్ కెరీర్ లో 30వ సినిమాగా వస్తున్న ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసేందుకు తనకి హిట్ ఇచ్చిన దర్శకుడినే నమ్ముకున్నాడు తారక్. జనతా గ్యారేజ్ సినిమాతో ఎన్టీఆర్ ని 100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టేలా చేసిన కొరటాల శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు.
NTR : కనురెప్పతో కూడా పెర్ఫార్మన్స్ చేయగల నటుడు ఎన్టీఆర్.. లాస్ ఏంజెల్స్ వేదికపై రాజమౌళి!
సముద్రం బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. కొరటాల మునపటి సినిమా ఆచార్య ప్లాప్ కావడంతో, ఈ మూవీ విషయంలో పక్కా ప్రణాళికని సిద్ధం చేసుకుంటున్నాడు. కథ, కథనం, సెట్ డిజైన్, మ్యూజిక్ ఇలా అన్ని ఫైనల్ చేసుకొని షూటింగ్ వెళ్ళడానికి కొరటాల ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా RRR పూర్తి అయ్యి దాదాపు ఏడాది పూర్తి అవుతున్నా, తదుపరి సినిమా గురించి అప్డేట్ రాకపోవడంతో అనేక వార్తలు వస్తున్నాయి. దీంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా అప్డేట్ ఇవ్వాలి అంటూ చిత్ర యూనిట్ డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఎన్టీఆర్ హాజరు అవ్వగా, ఫ్యాన్స్ NTR30 అప్డేట్ ఇవ్వాలి అంటూ గోల చేశారు. దీనికి ఎన్టీఆర్ స్పందిస్తూ.. ‘ఫిబ్రవరి నెలలోనే మూవీ ఓపెనింగ్ జరుగుతుంది. మంచి ముహూర్తం కోసం చూస్తున్నాము. మార్చ్ 20 లేదంటే అంతకంటే ముందే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాము. ఆల్రెడీ చెప్పినట్లు 2024 ఏప్రిల్ 5కి సినిమాని తప్పకుండా రిలీజ్ చేస్తాము’ అంటూ బదులిచ్చాడు. ఇక స్వయంగా ఎన్టీఆర్ ఈ వార్త చెప్పడంతో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. కాగా ఈ సినిమాని కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.