NTR : కనురెప్పతో కూడా పెర్ఫార్మన్స్ చేయగల నటుడు ఎన్టీఆర్.. లాస్ ఏంజెల్స్ వేదికపై రాజమౌళి!

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమా ఆస్కార్ రేస్ లో ఉండగా, ప్రస్తుతం ఓటర్ల కోసం లాస్ ఏంజెల్స్ లో స్పెషల్ స్క్రీనింగ్ జరుగుతుంది. ఈ స్క్రీనింగ్ కి దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్ హాజరయ్యారు. షో కంప్లీట్ అయ్యాక వీరిద్దరూ ఓటర్లతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ క్రమంలో రాజమౌళి, ఎన్టీఆర్ నటనపై ప్రశంసలు కురిపించాడు.

Kaburulu

Kaburulu Desk

January 8, 2023 | 05:29 PM

NTR : కనురెప్పతో కూడా పెర్ఫార్మన్స్ చేయగల నటుడు ఎన్టీఆర్.. లాస్ ఏంజెల్స్ వేదికపై రాజమౌళి!

NTR : రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు స్వాతంత్ర సమరయోధులు కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు పాత్రల్లో అద్భుతమైన నటన కనబరిచారు. వీరిద్దరి నటనకి హాలీవుడ్ ఆడియన్స్ సైతం ఫిదా అయిపోతున్నారు. ఇక రాజమౌళి మేకింగ్‌కి, విజన్‌కి ప్రపంచ సినీ సాంకేతిక సినీ నిపుణులు సలాం అంటున్నారు.

NTR : ఆస్కార్‌ లిస్ట్‌లో ఇండియా నుంచి ఫస్ట్ యాక్టర్‌గా ఎన్టీఆర్..

దీంతో ఈ మూవీ ఇప్పటికే పలు అంతర్జాతీయ పురస్కారాల్లో అవార్డులు గెలుచుకుంది. ఇటీవల ఆస్కార్ నామినేషన్స్ లో ‘నాటు నాటు’ సాంగ్ రేస్ లో నిలిచింది. ప్రస్తుతం ఓటర్ల కోసం లాస్ ఏంజెల్స్ లో స్పెషల్ స్క్రీనింగ్ జరుగుతుంది. ఈ స్క్రీనింగ్ కి దర్శకుడు రాజమౌళి, ఎన్టీఆర్ హాజరయ్యారు. షో కంప్లీట్ అయ్యాక వీరిద్దరూ ఓటర్లతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ క్రమంలో రాజమౌళి, ఎన్టీఆర్ నటనపై ప్రశంసలు కురిపించాడు.

ఇప్పటివరకు నేను తీసిన అన్ని సినిమాలో.. “నేను డైరెక్ట్ చేసిన బెస్ట్ సీన్ కొమరం భీముడొ సాంగ్. నా కెరీర్ లోనే అది బెస్ట్ సీన్. మీరు కేవలం కనురెప్పకి మాత్రమే కెమెరా పెట్టినా, దానితో కూడా పెర్ఫార్మన్స్ చేయగల నటుడు ఎన్టీఆర్” అంటూ గొప్పగా ప్రశంసించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా ఒరిజినల్ సాంగ్ క్యాటగిరీలో ‘నాటు నాటు’ ఆస్కార్ గెలుచుకుంటుందా? లేదా? అనేది చూడాలి. ఇక ఇటీవలే న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ లో రాజమౌళి బెస్ట్ డైరెక్టర్ గా అవార్డుని అందుకున్నాడు.