Penalty for smoking: సిగరెట్ తాగినందుకు రూ.8.8 లక్షల ఫైన్.. ప్రభుత్వ ఉద్యోగి మైండ్ బ్లాంక్!

Kaburulu

Kaburulu Desk

March 29, 2023 | 11:07 PM

Penalty for smoking: సిగరెట్ తాగినందుకు రూ.8.8 లక్షల ఫైన్.. ప్రభుత్వ ఉద్యోగి మైండ్ బ్లాంక్!

Penalty for smoking: బహిరంగ ప్రదేశాలలో పొగ తాగడం నేరం. ఈ విషయం ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలిసినా చాలా మంది పొగరాయుళ్లు మాత్రం ఎక్కడ పడితే అక్కడ ఉఫ్ అని ఊదేస్తుంటారు. ఫ్యాక్టరీలు, కంపెనీలలో సైతం స్మోక్ జోన్ లో మాత్రమే దమ్ము కొట్టాలి. కానీ, కొంతమంది అక్కడ కూడా ఎక్కడ మూడ్ ఉంటే అక్కడ అంటించేసి ఇతరులను ఇబ్బంది పెట్టేస్తుంటారు. అలాంటి వారు ఈ స్టోరీ ఖచ్చితంగా చదవాల్సిందే.

ఎందుకంటే ఒకవ్యక్తి సిగరెట్ తాగినందుకు ఏకంగా రూ.8 లక్షల పైన ఫైన్ పడింది. అది కూడా ఓ ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి కూడా అలా సిగరెట్ తాగడం ఏంటని పైన చివాట్లు కూడా పడ్డాయి. జపాన్‏కు చెందిన ఒసాకా నగరంలోని ప్రభుత్వ ఫైనాన్స్ డిపార్ట్‏మెంట్‏లో ఉన్నత హోదాలో ఉన్న ఓ ప్రభుత్వ అధికారి నిబంధనలకు విరుద్ధంగా ధూమపానం చేసి ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యాడు.

అది కూడా గత 14 ఏళ్లుగా అక్కడే సుమారు 4500 సార్లు దమ్ముకొట్టి నిబంధనలు అతిక్రమించినట్లు పై అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఈ ప్రభుత్వ అధికారి తీరుతో సీరియస్ అయిన అధికారులు అతడికి ఏకంగా 14700 సింగపూర్ డాలర్ల జరిమాన విధించారు. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.8.8 లక్షల ఫైన్ సదరు ఉద్యోగి కట్టాలని యంత్రాంగం వెల్లడించింది. దీంతో సదరు ఉద్యోగికి మైండ్ బ్లాక్ అయ్యింది.

మన దేశంతో పోల్చుకుంటే జపాన్ లో నిబంధనలను కఠినంగా అమలు చేస్తారు. అందునా పరిసరాల పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. అందునా ప్రభుత్వ ఆఫీసులు, ఆస్తుల విషయంలో అయితే అక్కడ సిటిజన్లకు అమితమైన ప్రేమ ఉంటుంది. రోడ్ల మీద చిత్తు కాగితం కనిపించినా ఇక్కడ ప్రజలకు అమితమైన కోపం వస్తుంది. ఇక్కడ పిల్లలు సైతం స్కూల్ లో బాత్రూమ్స్ క్లీనింగ్ నుండి స్కూల్ గ్రౌండ్ స్వీపింగ్ వరకు భాగస్వాములవుతారు. అలాంటి దేశంలో ఇలా స్మోక్ చేస్తే ఆ మాత్రం ఫైన్ పడాలి కదా మరి!