Konaseema District: తన ఫస్ట్ నైట్ కార్యాన్ని వీడియో తీసి.. తానే సోషల్ మీడియాలో పెట్టిన యువకుడు

Kaburulu

Kaburulu Desk

March 2, 2023 | 09:02 AM

Konaseema District: తన ఫస్ట్ నైట్ కార్యాన్ని వీడియో తీసి.. తానే సోషల్ మీడియాలో పెట్టిన యువకుడు

Konaseema District: సోషల్ మీడియా.. ఇప్పుడు ఇదో మాఫియా. ఇందులో ఒక్కసారి దిగితే ఇక మళ్ళీ బయట పడడం అనేది ఉండదు. ఈ మధ్య కాలంలో పాలు తాగే వయసు పిల్లల నుండి ముదుసలి వరకు ఎవరి నుండి విన్నా ఈ సోషల్ మీడియా ఖాతాల గురించే. అంతగా విస్తృతంగా వ్యాప్తి తర్వాత.. లైక్ లు, షేర్లు, కామెంట్లే జీవితమైపోయింది. వీటికోసం ఎలాంటి వీడియోలు చేయడానికి అయినా సిద్ధపడుతున్నారు కొంతమంది. తాజాగా, ఓ యువకుడైతే ఏకంగా తన ఫస్ట్ నైట్ వీడియోనే పోస్ట్ చేశారు.

ఈ సోషల్ మీడియా వచ్చాక కొందరి పిచ్చి వెర్రితలలు వేస్తోంది. పదిమందికీ చేరువవ్వాలన్న ఆరాటం కొందరితో పిచ్చి పనులు చేయిస్తోంది. విచక్షణ కోల్పోయి రహస్యాలను కూడా బయటపెట్టేసుకుని కష్టాలను కొనితెచ్చుకుంటున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలంలోని ఓ గ్రామంలో ఇలాగే జరిగింది. తన ఫస్ట్ నైట్ కార్యాన్ని వీడియో తీసిన యువకుడు.. తానే ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

గత నెల ఫిబ్రవరి 8న కాట్రేనికోన మండలంలోని ఓ గ్రామానికి చెందిన 17 ఏళ్ల బాలికకు 20 ఏళ్ల యువకుడితో వివాహం జరిగింది. మైనర్ బాలికను పెళ్లి చేసుకోవడమే ఒక తప్పు కాగా.. మళ్ళీ ఫస్ట్ నైట్ కార్యక్రమాన్ని, ఆ తర్వాత జరిగిన తొలిరేయి దృశ్యాలను వీడియో తీశాడు. ఆ తర్వాత వాటిని అతనే తన పేరుపై ఉన్న వివిధ సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశాడు. వారి బంధువులు. స్నేహితులు ఈ వీడియోలను చూడడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

అలా చివరికి విషయం తెలిసిన బాలిక తల్లి గత నెల 20న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. 28న అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. ఈ విషయాన్ని కాట్రేనికోన పోలీసులు బుధవారం మీడియాకి వెల్లడించారు. ఇప్పుడు పెళ్లి కొడుకు సోషల్ మీడియాలో కటలకటాల పాలైన విషయం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ కాగా.. అదే సోషల్ మీడియాలో ఈ వార్త తెగ వైరల్ అవుతుంది.