Heart Attack: రవితేజ పాటకి స్టెప్పేస్తూ 19 ఏళ్ల యువకుడికి గుండెపోటు.. అక్కడిక్కడే మృతి!

Kaburulu

Kaburulu Desk

February 26, 2023 | 04:10 PM

Heart Attack: రవితేజ పాటకి స్టెప్పేస్తూ 19 ఏళ్ల యువకుడికి గుండెపోటు.. అక్కడిక్కడే మృతి!

Heart Attack: ఒకప్పుడు గుండెపోటు, గుండె జబ్బులు అంటే చాలా అరుదుగా కనిపించేది. 90ల్లో అయితే.. 60 ఏళ్ళు, 50 ఏళ్ల పైన వారికి వచ్చేది. అందులో కూడా చాలా మందికి మైల్డ్ స్ట్రోక్ కనిపించి తిరిగి కొన్నాళ్ళు పాటు బ్రతికేవారు. కానీ, ఇప్పుడు ఈ మహమ్మారికి వయసుతో పనిలేదు. వృద్ధుల నుండి పిల్లల వరకు ఎవరినైనా కబళిస్తుంది. అది కూడా కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్లే.. నిలబడిన వాళ్ళు నిలబడినట్లే ప్రాణాలను హరిస్తుంది.

ఒక్క మన తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మధ్య కాలంలో చాలా మంది హార్ట్ ఎటాక్ బారిన పడి చనిపోతున్నారు. 39 ఏళ్లకే నందమూరి తారకరత్న గుండెపోటుకు గురై 23 రోజులు ప్రాణాలతో పోరాడి చివరికి మరణించారు. 4 రోజుల కిందట ఓ పెళ్లి వేడుకలో వరుడికి గంధం రాస్తూ ఓ వ్యక్తి అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. సికింద్రాబాద్‌లో కానిస్టేబుల్‌ విశాల్‌, కోనసీమలో వాలంటీర్‌ రాజాబాబు‎లు కూడా సడన్‌గా హార్ట్ ఎటాక్‌తో ప్రాణాలు వదిలారు.

కాగా, ఇప్పుడు ఓ 19 ఏళ్ల యువకుడు రవితేజ ఇడియట్ సినిమా నుండి చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే అనే పాటకి డాన్స్ చేస్తూ కుప్పకూలి అక్కడిక్కడే మరణించాడు. తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో ఈ విషాద ఘటన చోటు చేసింది. కుభీర్ పాడికె గ్రామంలో పెళ్ళి రిసెప్షన్ వేడుకలో ముత్యం అనే 19 ఏళ్ల యువకుడు డ్యాన్స్ వేస్తూ పడిపోయాడు. వెంటనే స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లారు.అయితే అప్పటికే అతడు చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

ముత్యం స్వస్థలం మహారాష్ట్రలోని శునికిగా తెలుస్తోండగా బ్రతకు దెరువు కోసం తెలంగాణకి వచ్చాడు. పెళ్లి వేడుకలో ఉత్సాహంగా డాన్స్ చేస్తుండగా పెళ్లికి వచ్చిన వారంతా చప్పట్లు కొడుతూ ముత్యంను ఎంకరేజ్ చేస్తున్నాడు. కానీ, ఇంతలోనే ఘోరం జరిగిపోయింది. డాన్స్ చేస్తున్న యువకుడు ఒక్కసారిగా ముందుకుపడి చనిపోయారు. వైద్యులు గుండెపోటుగా నిర్ధారించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://twitter.com/RameshVaitla/status/1629757690460209155?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1629757690460209155%7Ctwgr%5E5f1dcc2611ff04853e98f1932acbc9f47cc64a1a%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fmanalokam.com%2Fnews%2Ftelangana%2Fa-young-man-died-while-dancing-to-ravi-tejas-song.html