Mamidikaya Pulihara : ఉగాది స్పెషల్ మామిడికాయ పులిహార ఎలా తయారుచేసుకోవాలో తెలుసా?
వేసవి కాలం రాగానే మన అందరికీ లభించే ఇష్టమైన పండు మామిడి పండు. అలాంటి మామిడికాయతో మనం పులిహార, ఆవకాయ, పచ్చడి ఇంకా చాలా రకాలుగా వండుకోవచ్చు. చాలా మంది ఉగాదికి మామిడికాయ పులిహార చేసుకుంటారు..................

Mamidikaya Pulihara : వేసవి కాలం రాగానే మన అందరికీ లభించే ఇష్టమైన పండు మామిడి పండు. అలాంటి మామిడికాయతో మనం పులిహార, ఆవకాయ, పచ్చడి ఇంకా చాలా రకాలుగా వండుకోవచ్చు. చాలా మంది ఉగాదికి మామిడికాయ పులిహార చేసుకుంటారు. ఈ సారి ఉగాది మార్చ్ 22న వచ్చింది. ఈ శోభకృత్ నామ ఉగాదికి మనం మామిడికాయ పులిహార ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.
మామిడికాయ పులిహారకు కావలసిన పదార్థాలు:-
* ఆవాలు
* పచ్చిశనగపప్పు
* వేరుశనగ గుళ్ళు
* సాయి పప్పు
* పచ్చి మిర్చి 5 చీలికలుగా చేసుకోవాలి
* ఎండు మిర్చి 5
* కరివేపాకు
* పసుపు
* ఉప్పు
* నూనె
* మామిడికాయ చిన్నవి రెండు తురుముకొని ఉంచుకోవాలి
* బియ్యం అరకేజీ
ముందు బియ్యాన్ని శుభ్రంగా కడుగుకొని అన్నం వండుకోవాలి. అన్నం మెత్తగా కాకుండా కొంచెం పొడిగా ఉండేలా వండుకోవాలి. తరువాత ఒక పెద్ద పాత్రలో వేడి అన్నాన్ని తీసుకొని దానిలో నాలుగు స్పూన్ల నూనె, పసుపు, సరిపడా ఉప్పు కలుపుకోవాలి. తరువాత మామిడికాయ తురుము కలుపుకోవాలి. పొయ్యి మీద మూకుడు పెట్టుకొని నూనె వేసి కాగిన తరువాత ముందుగా పచ్చిశనగపప్పు, వేరుశనగ గుళ్ళు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తరువాత సాయి పప్పు, ఆవాలు, పచ్చి మిర్చి, ఎండు మిర్చి, పసుపు, కరివేపాకు వేసుకొని ఆవాలు చిటపట లాడిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి ముందుగా కలుపుకున్న మిశ్రమంలో ఈ తాలింపును కలుపుకోవాలి. తరువాత ఉప్పు, పులుపు సరిచేసుకొని మన టేస్ట్ కి సరిపడా లేకపోతే మళ్ళీ ఉప్పు, మామిడి కాయ తురుము కలుపుకోవాలి. అంతే పండగ నాడు టేస్టీ మామిడికాయ పులిహార రెడీ.