Bobbatlu : ఉగాది స్పెషల్ బొబ్బట్లు.. ఇలా చేయండి చాలా టేస్టీగా ఉంటాయి..

బొబ్బట్లు లేదా భక్ష్యాలు అనేవి ఉగాది పండుగ నాడు మన తెలుగు వాళ్ళు చేసుకునే ఒక సంప్రదాయకరమైన తీపి వంటకం. ఇది మన పూర్వీకుల నుండి చేసుకునే వంటకం. ఇది ఎంతో రుచిగా ఉంటుంది..................

Kaburulu

Kaburulu Desk

March 21, 2023 | 01:30 PM

Bobbatlu : ఉగాది స్పెషల్ బొబ్బట్లు.. ఇలా చేయండి చాలా టేస్టీగా ఉంటాయి..

Bobbatlu :  బొబ్బట్లు లేదా భక్ష్యాలు అనేవి ఉగాది పండుగ నాడు మన తెలుగు వాళ్ళు చేసుకునే ఒక సంప్రదాయకరమైన తీపి వంటకం. ఇది మన పూర్వీకుల నుండి చేసుకునే వంటకం. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. ఇంకా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ సారి ఉగాది మార్చ్ 22న వచ్చింది. ఈ శోభకృత్ నామ ఉగాదికి బొబ్బట్లు టేస్టీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.

బొబ్బట్లు తయారీకి కావలసిన పదార్థాలు:-

* మైదా 250 గ్రాములు
* పచ్చిశనగపప్పు 250 గ్రాములు
* బెల్లం 200 గ్రాములు
* సాల్ట్ చిటికెడు
* యాలకులు రెండు లేదా మూడు
* నెయ్యి 100 గ్రాములు

ముందుగా మైదాలో చిటికెడు సాల్ట్ కలుపుకొని సరిపడా నీళ్లు పోసుకొని చపాతీ ముద్ద లాగా తయారుచేయాలి. దానిని ఒక పాత్ర లో వేసి దానిపై తడి బట్ట ఉంచి ఒక పావు గంట సేపు నానబెట్టాలి. పచ్చిశనగపప్పును ఒక గంట సేపు నానబెట్టుకొని తరువాత సరిపడా నీళ్లు పోసి ఉడికించాలి. ఉడికించిన దానిని మనం మెత్తగా మెదుపుకొని ఉంచుకోవాలి. తరువాత బెల్లాన్ని మెత్తగా తురుముకొని మెదిపిన పప్పులో కలుపుకొని పొయ్యి మీద పెట్టుకొని గరిటెతో చిక్కబడేవరకు తిప్పుతుండాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి యాలకుల పొడి, రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. కలిపిన మిశ్రమం చల్లారిన తరువాత నిమ్మకాయ సైజు ఉండేలా ఉండలుగా చేసుకొని ఉంచుకోవాలి.

Mamidikaya Pulihara : ఉగాది స్పెషల్ మామిడికాయ పులిహార ఎలా తయారుచేసుకోవాలో తెలుసా?

మనం ముందుగా తయారుచేసుకున్న మైదా ముద్దని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చపాతీలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న చపాతీల మధ్యలో పప్పు ముద్దను పెట్టి చుట్టూ ఉన్న అంచులను పప్పు ముద్ద కనబడకుండా మూసేయాలి. తరువాత ఒక ఆయిల్ కవర్ని కట్ చేసి దాని మీద నెయ్యి రాసుకోవాలి. ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని మనం తయారుచేసుకున్న ముద్దలను ఆయిల్ కవర్ మీద ఉంచుకొని చేతితో చపాతీ లాగా అద్దుకోవాలి. పొయ్యి మీద పెనం పెట్టి కాగిన తరువాత నెయ్యి వేసి మనం తయారుచేసిన వాటిని నేతితో రెండు వైపులా చపాతీలా కాల్చుకోవాలి. అంతే కమ్మటి నేతి బొబ్బట్లు రెడీ.