Ugadi Pachhadi : ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసా? దానికి ఏమేం కావాలో తెలుసా?

మన తెలుగు రాష్ట్రాలలో తెలుగు సంవత్సరాది అనేది చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుతారు. మన తెలుగు రాష్ట్రాలలో ఉగాది పచ్చడి అనేది తెలుగు సంవత్సరాది నాడు చేసుకుంటారు. దీనిని మన తెలుగు వారితో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు లో కూడా జరుపుకుంటారు. ఉగాది పచ్చడి అంటే...................

Kaburulu

Kaburulu Desk

March 21, 2023 | 02:04 PM

Ugadi Pachhadi : ఉగాది పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసా? దానికి ఏమేం కావాలో తెలుసా?

Ugadi Pachhadi :  మన తెలుగు రాష్ట్రాలలో తెలుగు సంవత్సరాది అనేది చైత్ర శుద్ధ పాడ్యమి నాడు జరుపుతారు. మన తెలుగు రాష్ట్రాలలో ఉగాది పచ్చడి అనేది తెలుగు సంవత్సరాది నాడు చేసుకుంటారు. దీనిని మన తెలుగు వారితో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు లో కూడా జరుపుకుంటారు. ఉగాది పచ్చడి అంటే తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదుల సమ్మేళనం. మన జీవితంలో ఈ సంవత్సరం అంతా కూడా కష్టసుఖాలు అన్నీ ఉంటాయని వాటిని మనం అనుభవించాలి అని ఉగాది పచ్చడి ముఖ్య ఉద్దేశ్యం. ఈ సారి ఉగాది మార్చ్ 22న వచ్చింది. ఈ శోభకృత్ నామ ఉగాదికి కూడా ఉగాది పచ్చడి చేసుకొని తిందాం. ఉగాది పచ్చడిని మామిడి, వేప పువ్వు, బెల్లం, చింతపండు రసం ఇంకా అరటిపళ్ళు, జామకాయలు వంటి వాటితో కూడా తయారుచేస్తారు.

ఉగాది పచ్చడికి కావలసిన పదార్థాలు:-.

* మామిడి కాయ ఒకటి
* వేప పువ్వు కొద్దిగా
* చింతపండు కొద్దిగా
* బెల్లం కొద్దిగా
* పర్చి మిరపకాయలు
* అరటి పండు 1
* ఉప్పు
* నీళ్లు
* చిన్న చిన్న కొబ్బరి ముక్కలు

Mamidikaya Pulihara : ఉగాది స్పెషల్ మామిడికాయ పులిహార ఎలా తయారుచేసుకోవాలో తెలుసా?

ముందుగా వేప పువ్వును కాడల నుండి వేరు చేసి వేప పువ్వును చెరగాలి. మామిడి కాయను, పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఉంచుకోవాలి. చింతపండును నానబెట్టిన తరువాత దాని నుండి చింతపండు రసాన్ని తీసుకొని ఉంచుకోవాలి. ఒక గిన్నెలో కావలసిన నీళ్లను తీసుకోవాలి. అందులో బెల్లం, చింతపండు రసం, మామిడి ముక్కలు, కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. షడ్రుచుల ఉగాది పచ్చడి తయారవుతుంది. దీనిని పూజ చేసేటప్పుడు దేవుళ్ళకు నైవేద్యంగా అందించి అనంతరం మనం తినొచ్చు.