Dimples : బుగ్గలో సొట్ట ఉంటే బాగుండు అనుకుంటుంన్నారా?? కానీ అది ఎలా వస్తుందో తెలుసా?

 మనం నవ్వినప్పుడు బుగ్గలో సొట్ట పడితే చాలా బాగుంటుందని అందరూ అంటూ ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలకు నవ్వితే బుగ్గలో సొట్ట పడితే చాలా అందంగా ఉంటారు. కానీ అందరికీ అలా నవ్వినప్పుడు బుగ్గలో సొట్ట పడదు. కొంతమందికి మాత్రమే.............

Kaburulu

Kaburulu Desk

February 5, 2023 | 12:00 PM

Dimples : బుగ్గలో సొట్ట ఉంటే బాగుండు అనుకుంటుంన్నారా?? కానీ అది ఎలా వస్తుందో తెలుసా?

Dimples :  మనం నవ్వినప్పుడు బుగ్గలో సొట్ట పడితే చాలా బాగుంటుందని అందరూ అంటూ ఉంటారు. ముఖ్యంగా అమ్మాయిలకు నవ్వితే బుగ్గలో సొట్ట పడితే చాలా అందంగా ఉంటారు. కానీ అందరికీ అలా నవ్వినప్పుడు బుగ్గలో సొట్ట పడదు. కొంతమందికి మాత్రమే అలా ఏర్పడుతుంది. సొట్టబుగ్గల మీద సినిమాల్లో కూడా డైలాగ్స్, పాటలు వచ్చాయి.

మానవ శరీర నిర్మాణమే సొట్ట బుగ్గలు ఏర్పడడానికి ప్రధాన కారణం. మన శరీరంలో చెంప మొదటి నుండి నోటి వరకు ఒకే ప్రధాన కండరం జైగోమాటికాస్ అనేది ఉంటుంది. అయితే కొంతమందిలో ఈ కండరం చిన్నప్పుడే రెండు భాగాలుగా విడిపోతుంది. ఒకటి నోటి దగ్గరే ఆగిపోతుంది. ఇంకొకటి నోటి చివరి వరకు వెళుతుంది. ఈ విధంగా రెండు కండరాలుగా విడిపోతాయి. అప్పుడు వారు నవ్వినప్పుడు కండరం లోపలికి వెళ్లి బుగ్గ లోపలికి వెళ్లడం వల్ల సొట్టబుగ్గలు ఏర్పడతాయి. ఈ సొట్ట బుగ్గల వెనుక ఇంత సైన్స్ ఉంది.

Protein Food : శాకాహారులు మాంసాహారంలోని ప్రోటీన్స్ కోసం ఎలాంటి ఆహరం తినాలో తెలుసా??

సొట్టబుగ్గలు పడే అమ్మాయిలు, అబ్బాయిలు అందర్లోనూ ఇది జరుగుతుంది. కాబట్టి సొట్టబుగ్గలు ఏర్పడితే ఈ శరీర ప్రక్రియ వల్ల ఏర్పడ్డాయని అందరూ తెలుసుకోవాలి. దీనివల్ల నవ్వినప్పుడు అందంగా కనపడటం అనేది అదనంగా వచ్చింది.