Peddagattu Jathara 2023: నేటి నుండి ప్రారంభం కానున్న పెద్దగట్టు జాతర…! ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?

Kaburulu

Kaburulu Desk

February 5, 2023 | 11:48 AM

Peddagattu Jathara 2023: నేటి నుండి ప్రారంభం కానున్న పెద్దగట్టు జాతర…! ప్రాముఖ్యత ఏమిటో తెలుసా?

నల్లొండ జిల్లా లోని చివ్వెంల మండలం దురాజ్ పల్లిలో యాదవు ల కులదైవంగా పేరొందినది లింగమంతుల జాతర. తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతరగా పెద్దగట్టు గుర్తింపు పొందింది. చరిత్ర కలిగిన ఈ లింగమంతుల స్వామి జాతరకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు. నల్లొండ జిల్లా దురాజ్ పల్లిలో ఐదు రోజులపాటు జరిగే ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా కృష్ణా, గుంటూరు, ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకొని తమ మొక్కులను తీర్చుకుంటారు. 

తెలంగాణలో రెండో అతి పెద్దదిగా పేరుగాంచిన పెద్దగట్టు జాతర ఆదివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. సూర్యాపేట పట్టణానికి  5 కిలోమీటర్ల దూరంలో 65వ నెంబర్ జాతీయ రహదారిపై చివ్వెంల మండలం దురాజ్‌‌‌‌పల్లి వద్ద రోడ్డు పక్కనే పెద్దగట్టు గుట్టపై లింగమంతుల స్వామి కొలువై ఉన్నారు. ఈ జాతర  దాదాపు 250 సంవత్సరాల నుంచి జరుగుతున్నట్లు  చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి.

ఐదు రోజులపాటు సాగే ఈ జాతరకు రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, కర్నాటక, చత్తీస్‌‌‌‌గఢ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. జాతరకు దాదాపు 15లక్షల మంది భక్తులు వచ్చే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. జాతర ఏర్పాట్ల కోసం రూ.5 కోట్లను  ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులతో పాటు సూర్యాపేట మున్సిపాలిటీ, ఇతర శాఖలు రూ.1.7 కోట్లతో అభివృద్ధి పనులు పూర్తి చేశాయి.