Happy Tips : రోజంతా ఉత్సాహాన్ని కోల్పోకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?

Kaburulu

Kaburulu Desk

December 11, 2022 | 04:15 PM

Happy Tips : రోజంతా ఉత్సాహాన్ని కోల్పోకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..?

Happy Tips :  ఈ రోజుల్లో ఎవరైనా ఉదయం లేవగానే చేసే పని ఫోన్ చూడడం, కానీ ఇలా ఉదయాన్నే ఫోన్ చూడడం వలన బద్దకం ఇంకా పెరుగుతుంది. కొంతమంది ఉదయం ఉత్సాహంగానే తమ పనిని మొదలుపెడుతూ ఉంటారు కానీ కొంచెం సేపు అయిన తరువాత మళ్ళీ ఉత్సాహాన్ని కోల్పోతూ ఉంటారు. కాబట్టి ముందుగా రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే ఉదయాన్నే నిద్ర లేవాలి. నిద్ర లేచి ఫోన్ ని మాత్రం పెట్టుకోకూడదు.

ఉదయాన్నే నిద్ర లేవడం వలన మనం ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తాము. కొంచెం సమయం ఎండలో ఉండాలి ఇలా చేయడం వలన ఎండలో ఉండే విటమిన్ డి మన శరీరానికి లభిస్తుంది. విటమిన్ డి లోపం వలన కూడా ఈ రోజుల్లో చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. ఉదయాన్నే లేచి ఎండలో ఉండడం వలన మన శరీరానికి విటమిన్ డి అందడమే కాకుండా రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఉదయాన్నే వాకింగ్ లేదా జాగింగ్ చేయడం వలన కూడా ఉత్సాహంగా ఉంటారు.

Jonna Rotte : జొన్నలతో చేసిన రొట్టెలు తినండి.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలా తెలుసా??

ఉదయాన్నే తినే టిఫిన్ లో ఆయిల్ తో చేసిన పదార్థాలు లేకుండా ఉండేలా చూసుకోవాలి లేకపోతే అవి తొందరగా జీర్ణం కాకుండా మనకు బద్దకాన్ని వచ్చేటట్లు చేస్తాయి. బజ్జీ, పూరీ వంటివి ఎక్కువగా తినకూడదు, ఇలాంటివి రోజూ తింటే తొందరగా జీర్ణం అవ్వవు ఇంకా అజీర్తి వంటి సమస్యలు వస్తాయి. ఫ్రూట్స్ తినడం, నీళ్లు ఎక్కువగా తాగడం వంటివి చేయడం వలన రోజంతా ఉత్సాహంగా ఉంటారు. కాబట్టి ఉదయాన్నే లేచి రోజంతా ఉత్సాహంగా ఉండేలా చూసుకోండి.