Manyamkonda Jathara: పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన మన్యంకొండ జాతర ప్రారంభం…! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?

Kaburulu

Kaburulu Desk

February 5, 2023 | 12:19 PM

Manyamkonda Jathara: పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన మన్యంకొండ జాతర ప్రారంభం…! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?

పేదల తిరుపతిగా పేరొందిందిన మన్యంకొండ మహబూబ్ నగర్ పట్టణానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలోనే ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రమైన శ్రీవేంకటేశ్వరస్వామి దేవస్థానం ఉంది. పాలమూరు తిరుపతిగా బాసిల్లుచున్న మన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వరస్వామి వారికి ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాలు ఎప్పుడు ప్రారంభం అవుతున్నాయి..? ప్రత్యేకతలు వంటి విషయాలను గురించి ఇపుడు తెలుసుకుందాం.

ఎత్తయిన కొండపై, ప్రశాంత వాతావరణంలో స్వామివారు కొలువై ఉన్నారు. మన్యంకొండ అనగా మునులు తపస్సు చేసుకునే కొండ అని అర్థం, వందల సంవత్సరాల క్రితం ఇక్కడ మునులు తపస్సి చేసినట్లు స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ దేవస్థానం దేవాదాయ శాఖ అధీనంలో ఉంది. పాలమూరులో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరిగే మన్యంకొండ జాతర ఉత్సవాలకు ఉమ్మడి పాలమూరు జిల్లానుంచే కాకుండా పొరుగున ఉన్న కర్ణాటక నుంచి కూడా వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు.

భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు 300 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామని మహబూబ్‌నగర్‌ ఎస్పీ కె.నరసింహ తెలిపారు. శుక్రవారం మన్యంకొండలో జాతర బందోబస్తుకు నియమించిన పోలీసులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పోలీసులకు పలు సూచనలు చేశారు. జాతరలో రద్దీ ఎక్కువగా ఉంటున్నందున చైన్‌ స్నాచింగ్‌లు, జేబుదొంగలు దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉన్నందున అలాంటి వారి కదలికలపై నిఘా పెట్టేందుకు మఫ్టీలో కొందరు పోలీసులను నియమించడం జరిగిందని చెప్పారు. కాగా మన్యంకొండ జాతర శనివారం నాడు ప్రారంభమై నేడు ఆదివారం, పౌర్ణమి కావడంతో వేంకటేశ్వర నామస్మరణతో కొండమొత్తం మారుమ్రోగిపోతోంది.