Teeth Health : దంత సమస్యల నుండి బయట పడాలి అనుకుంటున్నారా?

Kaburulu

Kaburulu Desk

December 20, 2022 | 08:00 PM

Teeth Health : దంత సమస్యల నుండి బయట పడాలి అనుకుంటున్నారా?

Teeth Health :  శరీరారోగ్యానికి ముఖద్వారం నోరే. ఆహారాన్ని తినేటప్పుడు, రకరకాల పానీయాలను తాగేటప్పుడు సరైన శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల వాటి ప్రభావం దంతాలపై కూడా పడుతుంది. దీంతో దంతాల సమస్యల వల్ల పళ్ళల్లో తీవ్రమైన నొప్పి వస్తుంది.

మనలో చాలామంది అందంగా కనిపించేందుకు ముఖానికి ఏవేవో క్రీములు, లోషన్లు వాడుతుంటారు. కొత్త కొత్త డైట్ ను ఫాలో అవుతారు. అందం ముఖంలోనే ఉంది అనుకోవడం పొరపాటే. పళ్ళు, పళ్ళ వరుస బాగోకపోతే కూడా చూడటానికి అంతగా బాగుండదు. అందుకే పళ్ళను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పళ్ళు పాడవడానికి గల కారణాలు తెలుసుకొని మనం తినే ఆహార పదార్థాలను గమనించుకోవాలి. కావిటీస్, దంతక్షయం రావడానికి గల కారణాలు తెలుసుకొని పాడు చేసే కొన్ని ఆహార పదార్ధాలకు దూరంగా ఉండాలి.

Sun Bath Therapy : సన్ బాత్ థెరఫీ గురించి తప్పక తెలుసుకోండి.. ఎంత మంచిదో ఆరోగ్యానికి..

*చక్కెర పదార్థాలు పానీయాలు
చక్కర పానీయాలు, మీ దంతక్షయం కావిటీస్, ప్రమాదాన్ని పెంచుతాయి. నోటిలో ఉండే బ్యాక్టీరియా చక్కెర తినడం వల్ల కుళ్లిపోయి కావిటీస్ గా ఏర్పాడతాయి. దీనివల్ల పళ్లు పుచ్చిపోతాయి.
*ఆమ్ల పదార్థాలు
కొన్ని ఆహార పదార్థాలు దంతాల ఎనామిల్ ని బలహీన పరుస్తాయి. టమాటో, సిట్రస్ పండ్లు, వెనిగర్ వంటివి సహజంగా ఎక్కువ ఆమ్లత్వం కలిగి ఉంటాయి, అవి మీ పళ్ళ ఎనామిల్ ని తినేస్తాయి. అలాంటి ఆహారాలు తిన్న తర్వాత నోటిని శుభ్రంగా కడగాలి.
*తిన్న తర్వాత అంటుకున్న ఆహారం దంతాలలో పుచ్చులు, కుళ్ళిపోవడానికి ప్రధాన కారణం అవుతాయి. అందుకే మీ నోటిని శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే నోటిలోని బ్యాక్టీరియా తీపి పదార్థాలు, పానీయాల పట్ల ఎక్కువగా ఆకర్షింపబడతాయి.
*కూరగాయలను, పండ్లను, చిరుధాన్యాల వంటి ఆరోగ్యకరమైన కార్బోహైడ్రేట్స్ ను ఎక్కువగా తినాలి.