BiggBoss 6 Contestants List : బిగ్ బాస్ 6వ సీజన్ కంటెస్టెంట్స్ వీళ్ళే.. వామ్మో 21 మంది.. టైటిల్ ఎవరు కొడతారో??

Kaburulu

Kaburulu Desk

September 5, 2022 | 01:09 PM

BiggBoss 6 Contestants List : బిగ్ బాస్ 6వ సీజన్ కంటెస్టెంట్స్ వీళ్ళే.. వామ్మో 21 మంది.. టైటిల్ ఎవరు కొడతారో??

BiggBoss 6 Contestants List : మొత్తానికి తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్న షో బిగ్ బాస్ కొత్త సీజన్ మొదలయింది. ఆదివారం సాయంత్రం బిగ్ బాస్ 6వ సీజన్ మొదలైంది. నాగార్జున హోస్ట్ గా, గ్రాండ్ గా ఈ షో మొదలైంది. ఓపెనింగ్ ఎపిసోడ్ డ్యాన్సులతో, స్పెషల్ గెస్టులతో అదిరిపోయింది. ఈ సారి ఏకంగా 21 మందితో బిగ్ బాస్ హౌస్ ని నింపారు. ఒక్కొక్క కంటెస్టెంట్ గ్రాండ్ గా బిగ్ బాస్ స్టేజిపైకి ఎంట్రీ ఇచ్చారు. వాళ్ళ గురించి పరిచయాలు అయ్యాక నాగార్జున వారిని హౌస్ లోకి పంపించారు.

ఈ సారి కంటెస్టెంట్స్ వీళ్ళే..

హౌస్ లోకి మొదటగా కార్తిక్ దీపం సీరియల్ ఫేమ్ కీర్తి కేశవ్ భట్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నువ్వు నాకు నచ్చావ్ సినిమా ఫేమ్ సుదీప(పింకీ), మూడో కంటెస్టెంట్ గా సిరి హనుమంత్ బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ ఎంట్రీ ఇచ్చాడు. నాలుగో కంటెస్టెంట్ గా యాంకర్ నేహా చౌదరి, ఐదో కంటెస్టెంట్ గా జబర్దస్త్ ఫేమ్ చలాకి చంటి, ఆరో కంటెస్టెంట్ గా సీరియల్ ఆర్టిస్ట్ శ్రీ సత్య, ఏడో కంటెస్టెంట్ గా ఆర్టిస్ట్ అర్జున్ కళ్యాణ్, ఎనిమిదో కంటెస్టెంట్ గా గలాటా గీతూ, తొమ్మిదో కంటెస్టెంట్ గా డ్యాన్సర్, నటి అభినయశ్రీ, పది, పదకొండు కంటెస్టెంట్స్ గా రియల్ కపుల్, ఆర్టిస్టులు రోహిత్, మరీనాలు వచ్చారు. పన్నెండవ కంటెస్టెంట్ చంటిగాడు లాంటి సినిమాల్లో హీరోగా నటించిన బాలాదిత్య, పదమూడవ కంటెస్టెంట్ గా ఆర్టిస్ట్ వాసంతి కృష్ణ, పద్నాల్గవ కంటెస్టెంట్ గా ఆర్టిస్ట్ షాని, పదిహేనో కంటెస్టెంట్ గా ఆర్టిస్ట్ ఇనయా సుల్తానా, పదహారో కంటెస్టెంట్ గా ఆర్జే సూర్య, పదిహేడో కంటెస్టెంట్ గా జబర్దస్త్ ఫైమా, పద్దెనిమిదో కంటెస్టెంట్ గా బిగ్ బాస్ రివ్యూలతో ఫేమస్ అయిన ఆదిరెడ్డి. పంతొమ్మిదో కంటెస్టెంట్ గా మోడల్ రాజశేఖర్, ఇరవైవ కంటెస్టెంట్ గా ఇస్మార్ట్ న్యూస్ ఫేమ్ ఆరోహి రావ్. ఇరవైఒకటవ, చివరి కంటెస్టెంట్ గా సింగర్ రోహిత్ వచ్చారు.

ఈ సారి ఇంతమంది హౌస్ లో ఉండటంతో మరిన్ని గొడవలు, జంటలు ఏర్పడే అవకాశం ఉంది. మరి ఇంతమంది ఒకే హౌస్ లో ఉండి ప్రేక్షకులని ఎంత బాగా ఎంటర్టైన్ చేస్తారో చూడాలి. ఈ 21 మందిలో ఎవరు టైటిల్ కొడతారో చూడాలి.