Aa Ammayi Gurinchi Meeku Cheppali Trailer : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ట్రైలర్ రిలీజ్.. పీక్స్ లో కృతిశెట్టి యాక్టింగ్.. ఇంద్రగంటి మార్క్ సినిమా..

Kaburulu

Kaburulu Desk

September 5, 2022 | 01:38 PM

Aa Ammayi Gurinchi Meeku Cheppali Trailer : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ట్రైలర్ రిలీజ్.. పీక్స్ లో కృతిశెట్టి యాక్టింగ్.. ఇంద్రగంటి మార్క్ సినిమా..

Aa Ammayi Gurinchi Meeku Cheppali Trailer :  సుధీర్ బాబు హీరోగా, కృతిశెట్టి హీరోయిన్ గా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’. ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాలంటే చాలా క్లాసిక్ గా, అందరూ చూసే విధంగా, ఒక మంచి ఫీల్ గుడ్ మూవీలా ఉంటాయి. ఈ సినిమా కూడా అలాగే ఉండబోతుందని తెలుస్తుంది. ఇప్పటికే కొన్ని సాంగ్స్, టీజర్ ఈ సినిమా నుంచి రిలీజ్ చేయగా, తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు.

ట్రైలర్ లో సుధీర్ బాబు ఒక డైరెక్టర్ అయి సినిమా తియ్యడానికి మంచి హీరోయిన్ కోసం వెతుకుతున్న సమయంలో డాక్టర్ గా చేసే కృతిశెట్టిని చూడగానే యాక్టింగ్ చేయమని అడుగుతాడు. వాళ్ళింట్లో వాళ్ళు ఒప్పుకోరని నో చెప్తుంది. కానీ చివరికి ఎలాగోలా సుధీర్ బాబు కృతిశెట్టిని ఒప్పిస్తే, కృతి నాన్నగా యాక్ట్ చేసిన శ్రీకాంత్ ఆచార్య సినిమాలంటే ఇష్టం లేదని కృతిని కొడతాడు. చివరికి కృతిశెట్టి సినిమాలో చేస్తుందా లేదా అనేది థియేటర్లో చూడాలి.

ట్రైలర్ చూస్తే సినిమా అర్థమైపోతుంది. కాకపోతే సినిమాలో మంచి భావోద్వేగాలు ఉన్నట్టు తెలుస్తుంది. మరోసారి కృతిశెట్టికి నటనకి ఆస్కారం ఉన్న పాత్ర పడిందనే చెప్పొచ్చు. ట్రైలర్ లోనే కృతిశెట్టి యాక్టింగ్ అదరగొట్టింది అంటే సినిమాలో ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందో అర్ధమవుతుంది. ఇక ఇంద్రగంటి మార్క్ డైలాగ్స్, సీన్స్ తో కచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులని అలరిస్తుందని అర్ధమవుతుంది. ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా సెప్టెంబర్ 16న థియేటర్లలో రానుంది.