Krithi Shetty : కృతిశెట్టి ఏం చదువుతుందో తెలుసా..? కృతి చాలా ట్యాలెంట్..

Kaburulu

Kaburulu Desk

September 19, 2022 | 08:41 AM

Krithi Shetty : కృతిశెట్టి ఏం చదువుతుందో తెలుసా..? కృతి చాలా ట్యాలెంట్..

Krithi Shetty :  చిన్నప్పటినుంచే యాడ్స్ లో నటించి, కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి ఉప్పెన సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కృతిశెట్టి. ఉప్పెన సినిమా భారీ విజయం సాధించడంతో వరుస ఆఫర్లు కొట్టేసింది. ఉప్పెన, శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన కృతి ది వారియర్, మాచర్ల నియోజకవర్గం సినిమాలతో ఫ్లాప్స్ చూసింది. తాజాగా ఇటీవల రిలీజైన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమాతో గ్రాండ్ కంబ్యాక్ ఇచ్చింది.

Sharwanand : ఒక చెడ్డ సినిమా చేసి అది హిట్ అంటే.. ప్రేక్షకులని మోసం చేస్తున్నట్టే.. వాళ్ళకి అన్ని తెలుసు..

తాజాగా ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా సక్సెస్ మీట్ నిర్వహించగా కృతి మాట్లాడుతూ ఈ సినిమా తనకెంతో స్పెషల్ అంటూ చెప్పింది. కృతిని ప్రస్తుతం చదువుతున్నారా అని అడగగా.. ”ప్రస్తుతం నేను సైకాలజీ చదువుతున్నాను. మనుషులని అర్ధం చేసుకోవడానికి మాత్రమే కాదు. సినిమాల్లోని పాత్రలని కూడా అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడుతుందని సైకాలజీ చదువుతున్నాను. ఇది నాకు నటనకి కూడా హెల్ప్ అవుతుంది” అని తెలిపింది. ఇంటర్ లో ఉన్నప్పుడే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతి ఇప్పుడు సైకాలజీలో డిగ్రీ చేస్తుంది. ఓ పక్క సినిమాలని, మరో పక్క చదువుని బ్యాలెన్స్ చేస్తుంది.