Chinmayi Sripada : మా మధ్య విబేధాలు లేవు.. సమంత వల్లే నాకు కెరీర్ వచ్చింది.. కానీ ఇప్పుడు..

Kaburulu

Kaburulu Desk

September 3, 2022 | 02:50 PM

Chinmayi Sripada : మా మధ్య విబేధాలు లేవు.. సమంత వల్లే నాకు కెరీర్ వచ్చింది.. కానీ ఇప్పుడు..

Chinmayi Sripada :  సింగర్ చిన్మయి శ్రీపాద తన పాటల కంటే కూడా సమంతకి డబ్బింగ్ ఆర్టిస్ట్ గానే బాగా ఫేమస్ అయింది. ఏ మాయ చేసావే సినిమాలో సమంతకి తన నటనతో పాటు తన వాయిస్ కి కూడా బాగా పేరు వచ్చింది. ఆ సినిమాలో సమంతకి తెలుగులో డబ్బింగ్ చెప్పింది చిన్మయి. ఆ వాయిస్ బాగా పాపులర్ అవ్వడంతో అప్పట్నుంచి సమంతకి చిన్మయి డబ్బింగ్ చెప్పడమే కాక వేరే హీరోయిన్స్ కి కూడా చెప్తూ మరింత పాపులర్ అయింది. ఒకరకంగా చెప్పాలంటే సమంత వల్లే చిన్మయికి మంచి కెరీర్ ఏర్పడింది.

అయితే గత కొన్ని రోజులుగా వీరిద్దరికి విబేధాలు వచ్చాయని, వీరిద్దరూ ప్రస్తుతం దూరంగా ఉంటున్నారని, అందుకే ఇటీవల చిన్మయి సమంతకి డబ్బింగ్ చెప్పట్లేదని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చిన్మయి దీనిపై స్పందించింది.

చిన్మయి శ్రీపాద మాట్లాడుతూ.. ”సమంత వల్లే నాకు మంచి కెరీర్ వచ్చింది. అందులో డౌట్ లేదు. నేను, సమంత మంచి స్నేహితులం. సమంత తెలుగు పరిశ్రమకి వచ్చి చాలా ఏళ్ళు అయింది. తెలుగు బాగా నేర్చుకుంది. అందుకే ఇటీవల సమంత తన పాత్రలకి తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటుంది. అది మంచి విషయమే. దీనివల్ల మా స్నేహంలో విబేధాలు రాలేదు. ఇప్పటికి మేము కలుస్తూనే ఉన్నాం. మేము కలిసిన ప్రతిసారి ఫొటోలు పోస్ట్ చేయనంత మాత్రాన మా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చినట్టు కాదు. అన్నీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయను. సమంతకి నేను డబ్బింగ్ చెప్పినా, చెప్పకపోయినా మేమిద్దరం మంచి స్నేహితులమే” అని తెలిపింది.