Sir Movie : గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ కి ఫ్రీగా సార్ సినిమా చూపించిన చిత్రయూనిట్..
హైదరాబాద్ లోని పలు గవర్నమెంట్ స్కూల్స్ లోని స్టూడెంట్స్ కు సార్ సినిమా ఉచితంగా చూపించారు. PVR సంస్థతో కలిసి చిత్రయూనిట్ ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో...........

Sir Movie : ఇటీవల ధనుష్, సంయుక్త మీనన్ జంటగా డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సినిమా సార్. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 17న రిలీజయి మంచి విజయం సాధించింది. చదువుకున్న వ్యాల్యూని చూపిస్తూ మెసేజ్ తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులని మెప్పించింది. ఇందులోని ఎలివేషన్స్, ఎమోషనల్ సీన్స్ సినిమా చూసిన వాళ్ళని కంటతడి పెట్టించాయి. ఇక సార్ సినిమాకి ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చాయి.
మంచి సినిమా కావడంతో, చదువుకు ఉన్న విలువ గురించి చెప్పడంతో స్టూడెంట్స్, టీచర్స్ అంతా ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నారు చిత్రయూనిట్. ఇంత మంచి సినిమాని మరింతమందికి చేరవేయాలని చిత్రయూనిట్ తాజాగా ఓ మంచి పని చేసింది. హైదరాబాద్ లోని పలు గవర్నమెంట్ స్కూల్స్ లోని స్టూడెంట్స్ కు సార్ సినిమా ఉచితంగా చూపించారు. PVR సంస్థతో కలిసి చిత్రయూనిట్ ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో దాదాపు 500 మంది స్టూడెంట్స్ కి సార్ సినిమాని ఫ్రీగా చూపించారు. అంతేకాక వాళ్లందరికీ ఫ్రీగా పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ కూడా అందించారు.
Vishal : జస్ట్ మిస్.. కొద్దిలో చావు తప్పించుకున్నా.. షూటింగ్ లో ప్రమాదంపై విశాల్ వ్యాఖ్యలు..
చిత్రయూనిట్, PVR కలిసి చేసిన ఈ కార్యక్రమంలో పిల్లలు థియేటర్స్ కి వచ్చి సినిమా చూడటం, సందడి చేయడం వీడియో తీసి తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో పలువురు నెటిజన్లు, ప్రముఖులు, ధనుష్ అభిమానులు అభినందిస్తున్నారు. ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అంటూ మరింత ప్రమోట్ చేస్తున్నారు.