Vishal : జస్ట్ మిస్.. కొద్దిలో చావు తప్పించుకున్నా.. షూటింగ్ లో ప్రమాదంపై విశాల్ వ్యాఖ్యలు..

ప్రస్తుతం విశాల్ మార్క్ ఆంటోని అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతుంది. ఈ షూటింగ్ లో ఫైట్ సీన్ చేస్తుండగా ఓ భారీ ట్రక్కు సాకేంతిక లోపం వల్ల అదుపు తప్పి జనాల మీదకు దూసుకొచ్చింది................

Kaburulu

Kaburulu Desk

February 23, 2023 | 06:23 PM

Vishal : జస్ట్ మిస్.. కొద్దిలో చావు తప్పించుకున్నా.. షూటింగ్ లో ప్రమాదంపై విశాల్ వ్యాఖ్యలు..

Vishal :  సినిమా షూటింగ్స్ జరిగేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అనుకోకుండా కొన్ని కొన్ని సార్లు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి ఆ ప్రమాదాల్లో గాయపడిన వారు కూడా ఉన్నారు. తాజాగా హీరో విశాల్ షూటింగ్ లో జరిగిన ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇదివరకే గతంలో పలు సినిమా షూటింగ్స్ సమయంలో రిస్క్ షాట్స్ చేస్తూ హీరో విశాల్ గాయాలు పాలయ్యి కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయి.

ప్రస్తుతం విశాల్ మార్క్ ఆంటోని అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతుంది. ఈ షూటింగ్ లో ఫైట్ సీన్ చేస్తుండగా ఓ భారీ ట్రక్కు సాకేంతిక లోపం వల్ల అదుపు తప్పి జనాల మీదకు దూసుకొచ్చింది. ఇది గమనించి అంతా ఫాస్ట్ గా పక్కకు తప్పుకున్నారు. అప్పుడే విశాల్ కింద పడటంతో ట్రక్కు విశాల్ మీదకి వస్తుంది అనుకున్నారు. విశాల్ పక్కకి జరగడంతో ట్రక్కు కొద్దిగా పక్క నుంచి వెళ్ళింది. దీంతో జస్ట్ మిస్ విశాల్ భారీ ప్రమాదం నుంచి బయటపడ్డాడు.

Sukumar : పుష్ప సినిమా హిట్ అవ్వడానికి సోషల్ మీడియా కూడా కారణమే.. అందుకే పుష్ప 2లో కూడా..

షూటింగ్ లో జనాల మీదకు ట్రక్కు దూసుకురావడం, విశాల్ తప్పించుకునే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోని విశాల్ డైరెక్ట్ గా షేర్ చేసి.. జస్ట్ మిస్ అయ్యాను, చావుని దగ్గరనుంచి చూసి వచ్చాను అంటూ పోస్ట్ చేశాడు. మరో ప్రముఖ నటుడు sj సూర్య కూడా ఈ వీడియో షేర్ చేసి.. నేను కూడా అప్పుడు విశాల్ పక్కనే ఉన్నాను, జస్ట్ మిస్ అయ్యాము. లేదా ఇప్పుడు మేమిద్దరం ఇలా ట్వీట్ చేసేవాళ్ళం కాదు అంటూ పోస్ట్ చేశాడు. దీంతో విశాల్ అభిమానులు జాగ్రత్త అంటూ కామెంట్స్ చేస్తున్నారు.