Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

ప్రస్తుత కాలంలో నిలకడకు మారు పేరు తెచ్చుకున్న బాబర్ అజామ్ వన్డేల్లో ప్రపంచ రికార్డ్ సృష్టించాడు. ఈ జాబితాలో టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ 9వ స్థానంలో ఉండటం గమనార్హం.

Kaburulu

Kaburulu Desk

March 28, 2024 | 03:39 PM

Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

క్రికెట్‌ ప్రపంచంలో ప్రస్తుత కాలంలో విరాట్‌ కోహ్లీ, జో రూట్, కేన్ విలియమ్సన్, స్టీవ్‌ స్మిత్‌ తర్వాత అంతటి పేరు, టాలెంట్‌ ఉన్న ఆటగాడు బాబర్ అజామ్‌. పాక్‌ సారధిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత పాకిస్తాన్‌ క్రికెట్‌ కు మంచి గుర్తింపు, పేరు తీసుకొచ్చేందుకు బాగానే కృష్టి చేశాడు. ఇటీవలి కాలంలో విరాట్‌ కోహ్లీకి చెందిన కొన్ని రికార్డులను సైతం బాబర్‌ బద్దలు కొట్టడం చూశాం. ఇప్పటికే ప్రపంచ క్రికెట్ లో పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్న బాబర్.. మరో ఘనతను సాధించాడు. అంతర్జాతీయ వన్డేల్లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ 9వ స్థానంలో ఉండటం గమనార్హం. ఇంతకీ బాబర్ సాధించిన రికార్డ్ ఏంటో ఇపుడు చూద్దాం.

ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి వన్డేలో గెలిచిన పాకిస్థాన్ నిన్న జరిగిన రెండో వన్డేలో గ్రాండ్ విక్టరీ కొట్టింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచులో పాక్ ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించింది. పాక్ ఇనింగ్స్ లో ఇమాముల్ హక్ టాప్(91) స్కోరర్ కాగా బాబర్ అజాం తన ఫామ్ కొనసాగిస్తూ 53 పరుగులతో రాణించాడు.ఈ క్రమంలో ఒక ప్రపంచ రికార్డుని బాబర్ తన ఖాతాలో వేసుకున్నాడు. మొదటి 100 ఇన్నింగ్స్ ల్లో అత్యధిక పరుగులు చేసిన వారిలో టాప్ బ్యాటర్ గా నిలిచాడు.

ఇప్పటివరకు 102 వన్డేలాడిన బాబర్.. నిన్న ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన రెండో వన్డే ద్వారా 100 ఇన్నింగ్స్ లు పూర్తి చేసుకున్నాడు. మొదటి వంద ఇన్నింగ్స్ లో బాబర్ ఏకంగా 5,142 పరుగులు సాధించాడు.కాగా.. ఈ రికార్డు ఇప్పటి వరకు దక్షిణాఫ్రికా లెజెండ్ హసీం ఆమ్లా పేరిట ఉంది. అతడు తన 100 వన్డే ఇన్నింగ్స్ లలో 4,946 రన్స్ చేశాడు. తాజా మ్యాచ్ ద్వారా బాబర్ ఈ రికార్డ్ ను బ్రేక్ చేశాడు. కాగా ఈ రికార్డు సాధించిన తొలి క్రికెటర్ గా బాబర్ ఘనతకెక్కాడు. ఇక ఈ అరుదైన జాబితాలో బాబర్ తర్వాత వరుసగా హసీం ఆమ్లా, విండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్(4607), విండీస్ సారథి షై హోప్(4436), జో రూట్(4428) ఉన్నారు. ఇక ఈ లిస్ట్ లో విరాట్ కోహ్లీ 4230 పరుగులతో 9వ స్థానంలో ఉన్నాడు. మరి బాబర్ సాధించిన ఈ రేర్ రికార్డ్ భవిష్యత్తులో ఎవరు బ్రేక్ చేస్తారో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.