ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

జబర్ధస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది నటులు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అలాంటి వారిలో శాంతి అలియాస్ శాంతి స్వరూప్ ఒకరు. లేడీ గెటప్ లో ఎన్నో కామెడీ స్కిట్స్ చేసి అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంటాడు.

Kaburulu

Kaburulu Desk

March 28, 2024 | 03:44 PM

ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

తెలుగు బుల్లితెరపై వస్తున్న జబర్ధస్త్ కామెడీ షో గురించి తెలియని వారు ఉండరు.  2013 న ప్రారంభమైన ఈ కామెడీ షోలో కమెడియన్లు ఎన్నో కొత్త కొత్త స్కిట్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటారు. జబర్ధస్త్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లు ఇప్పడు ఇండస్ట్రీలో హీరోలు, స్టార్ కమెడియన్లు గా కొనసాగుతున్నారు. జబర్ధస్త్ కామెడీలో చాలా మంది మగవాళ్లు లేడీ గెటప్స్ తో అదరగొడుతుంటారు. అలాంటి వారిలో శాంతి అలియాస్ శాంతి స్వరూప్ ఒకరు. తాజాగా శాంతి స్వరూప్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

జబర్ధస్త్ కామెడీ షో ద్వారా బాగా పాపులర్ అయిన శాంతి అలియాస్ శాంతి స్వరూప్ లేడీ గెటప్ లో నటిస్తూ అందరినీ అలరిస్తున్నాడు. లేడీ గెటప్ లో శాంతి స్వరూప్  ఎన్నో స్కిట్స్ లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. తన కామెడీతో కోట్ల మంది ప్రేక్షకులను నవ్విస్తున్న శాంతి స్వరూప్.. తన జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయని పలు ఇంటర్వ్యూల్లో చెబుతున్న విషయం తెలిసిందే. తాజాగా శాంతి స్వరూప్ కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో శాంతి స్వరూప్ తనకు ఉన్న ఒక్కగానొక్క ఇల్లు అమ్మేస్తున్నా అని.. ఇది తన తల్లి ఆపరేషన్ కోసం అని ఆవేదనగా చెబుతున్నాడు.

గతకొంత కాలంగా శాంతి స్వరూప్ తల్లిగారికి ఆరోగ్యం బాగాలేకపోవడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమెకు ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించడంతో తన వద్ద డబ్బు లేక తనకంటూ మిగిలిన ఒక్క ఇల్లు అమ్మేస్తున్నట్లు శాంతి స్వరూప్ వీడియో ద్వారా తెలిపారు. ఇల్లు అమ్మేస్తున్నట్లుగా తన తల్లికి తెలియదని.. ఒకవేళ తెలిస్తే ఎంతో బాధపడుతుందని చెప్పలేదని శాంతి స్వరూప్ ఇన్ స్ట్రాగామ్ వేదికగా తెలిపారు.   శాంతి స్వరూప్ మాటల్లోని ఆవేదన అందరి హృదయాలు కలచివేస్తుంది. అమ్మ కోసం మీరు చేస్తున్న త్యాగం చాలా గొప్పది అమ్మకు మించిన ఆస్తి సంపద ఏదీ లేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.