Shamshabad: మద్యం మత్తులో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన కామాంధుడు.. పరిస్థితి విషమం!

Kaburulu

Kaburulu Desk

March 16, 2023 | 04:59 PM

Shamshabad: మద్యం మత్తులో నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన కామాంధుడు.. పరిస్థితి విషమం!

Shamshabad: తెలంగాణలో మరో దారుణం జరిగింది. మహిళలపై అఘాత్యాలను అరికట్టేందుకు ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని కఠిన చట్టాలను తీసుకువచ్చినా ఫలితం లేకుండా పోతోంది. కామంతో కళ్ళు మూసుకుపోయిన దుర్మార్గులు చిన్న, పెద్ద తేడా లేకుండా, వావి వరసలు చూడకుండా అత్యాచారాలకు పాల్పడుతూ మహిళల జీవితాన్ని నాశనం చేస్తున్నారు. ఒక రకంగా మనుషుల కంటే క్రూర మృగాలే నయం అనిపిస్తుంది. జంతువుల కంటే దారుణంగా కొంతమంది దుర్మార్గులు చెలరేగిపోతున్నారు.

రెండు, మూడు ఏళ్ల చిన్నారుల నుండి 50, 60 ఏళ్ల మహిళల వరకు అత్యాచారాలకు గురవుతూనే ఉన్నారు. దీనితో ఇంటిదగ్గర ఒంటరిగా ఉండే మహిళలకు భద్రత అనేది కరువు అవుతొంది. తాజాగా మరో నాలుగేళ్ళ చిన్నారి మానవ మృగం చేతిలో అత్యాచారానికి బలయ్యింది. చిన్నారి ప్రస్తుతం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. హైదరాబాద్ శివారులోని శంషాబాద్ ఏరియాలో ఈ ఘోరం జరిగింది. అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై ఓ మృగం అత్యంత పాశవికంగా అత్యాచారం చేసాడు.

ఆడపిల్ల అయితే చాలు చిన్నా, పెద్దా తేడా లేకుండా అత్యాచారలకు పాల్పడుతున్న కామాంధుల కర్కషత్వానికి చిక్కుకొని మరో చిన్నారి ప్రాణాల కోసం పోరాటం చేస్తోంది. హైదరాబాదులోని శంషాబాద్ ఏరియాలో ఓ నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆ చిన్నారిపై అత్యంత పాశవికంగా జరిగిన ఈ దాడిలో తీవ్ర గాయాలపాలయ్యింది. పాపను గమనించిన స్థానికులు హుటాహుటిన నీలోఫర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పాపను పరీక్షించిన వైద్యులు వెంటనే పాపకు సర్జరీ చేశారు. అయితే పాప పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. శంషాబాద్ ఫ్లైఓవర్ దగ్గర ఉన్న లేబర్ క్యాంపులో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ చిన్నారి తల్లిదండ్రులు బెంగుళూరు నుంచి హైదరాబాదుకు ఉపాధి కోసం వలస వచ్చినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడైన వెంకటయ్యను అరెస్టు చేశారు.