Rape In Hyderabad: మరో దారుణం.. నాలుగేళ్ళ చిన్నారిపై ఆటోలో అత్యాచారం చేసిన కామాంధుడు!

Rape In Hyderabad: బాలికా సంరక్షణ చట్టాలు ఎన్ని ఉన్నా, కామాంధులకు ఉరి శిక్ష వేసినా, నిర్భయ వంటి కఠిన చట్టాలు అమలవుతున్నా సరే అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. ఎంకౌంటర్లు చేసినా మృగాళ్ళు మాత్రం మారటం లేదు. అభం శుభం తెలియని చిన్నారుల నుండి పండు ముసలి వరకు ఎవరినీ వదలని మానవ మృగాలు రెచ్చిపోతున్నారు. అభం శుభం తెలియని పసి వాళ్ళను చిదిమేస్తున్నారు. ఇక అలాంటి ఘటనే హైదరాబాద్ మహా నగరంలో మరొకటి వెలుగు చూసింది.
ఓ చిన్నారికి చాక్లెట్ ఇస్తానని ఆశ చూపించి.. తను దగ్గరకు రాగానే ఆచిన్నారిని ఆటోలో లైంగిక దాడికి పాల్పడిన ఘటన బంజారాహిల్స్ లో కలకలం రేపింది. నగరంలోని బంజారాహిల్స్ లో నాలుగేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అఘాయిత్యం చేసిన ఘటన సంచలనంగా మారింది. నాలుగేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు కన్నుపడింది. ఎలాగైనా ఆచిన్నారిపై తన కామవాంఛ తీర్చుకోవాలని ప్లాన్ వేశాడు. ఎవరు లేని సమయం కోసం వేచి చూశాడు. చివరకు ఆ సమయం రానే వచ్చింది.
చిన్నారి బయట ఆడుకుంటున్న సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడం గమనించాడు. దీంతో ఆ చిన్నారి దగ్గరకు వెళ్లాడు. చాక్లెట్ ఇప్పిస్తానని ఆశ కలగించాడు. దీంతో చాక్లెట్ తిందామనే ఆశతో ఆచిన్నారి సైతం తనతో వెళ్లేందుకు సిద్దమైంది. ఎవరూ గమనించకపోవడంతో ఆ చిన్నారిని ఎత్తుకెళ్లాడు. ఎవరూ లేని ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి ఒక ఆటోలో ఆ చిన్నారిపై లైంగికంగా దాడి చేశాడు.
ఆ మానవ మృగం చేష్టలకి ఆ చిన్నారి భరించలేక ఏడుస్తూ గట్టిగా కేకలు వేసింది. చిన్నారి కేకలను గమనించిన స్థానికులు ఆ మృగాన్ని పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా.. బంజారాహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకుని లైంగిక దాడి యత్నించిన నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. పొక్సో కేసు నమోదు చేశారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.