Telangana: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య.. మృతదేహాన్ని 36 కి.మీ ఈడ్చుకెళ్ళిన రైళ్లు

Kaburulu

Kaburulu Desk

January 27, 2023 | 09:14 AM

Telangana: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య.. మృతదేహాన్ని 36 కి.మీ ఈడ్చుకెళ్ళిన రైళ్లు

Telangana: అనారోగ్య కారణాలతో ఓ వృద్ధుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోగా.. మృతదేహం రైలు ఇంజన్ లో ఇరుక్కొని ఏకంగా 36 కిలోమీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది. చివరికి మరో లోకో ఫైలట్ చూసి ట్రైన్ ఆపి సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో రెండు గంటల పాటు శ్రమించి ఇంజన్ లో ఇరుక్కున్న మృతదేహాన్ని బయటకి తీశారు. వరంగల్ జిల్లా హన్మకొండలో ఈ ఘటన జరిగింది.

హన్మకొండలోని నయిూంనగర్‌కు చెందిన గద్వాల అప్పలయ్య(72) వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య డిపార్ట్‌మెంట్‌లో జావాన్‌గా పనిచేసి కొన్నేళ్ల క్రితం రిటైర్ అయ్యాడు. కాగా, అప్పలయ్య గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతుండగా.. గురువారం కాజీపేట సమీపంలో రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆ మార్గంలో వెళుతున్న చెన్నై-లక్నో అండ‌మాన్ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఇంజిన్‌కు మృతదేహాం చిక్కుకుంది.

దాదాపు 36 కిలోమీటర్ల మేర అండ‌మాన్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్ ఉప్పలయ్య మృతదేహాన్ని ఈడ్చుకెళ్లింది. మరో లోకో పైలట్ మృతదేహాన్ని గుర్తించి జమ్మికుంట స్టేషన్ మాస్టర్‌కు సమాచారం ఇచ్చాడు. దీంతో ట్రైన్‌ను జమ్మికుంటలో ఆపేశారు. రైలు ఇంజిన్ లోపల చిక్కుకోవడంతో మృతదేహాన్ని బయటకు తీయడానికి దాదాపు 2 గంటల సమయం పట్టింది. గడ్డపారతో తవ్వి మరీ మృతదేహాన్ని స్థానికులు బయటకు తీశారు. మృతుడు ఉప్పలయ్య వద్ద ఆధార్ కార్డుతో పాటు సూసైడ్ లెటర్‌ను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తన చావుకు ఎవరు కారణం కాదని లెటర్‌లో రాసి ఉండగా.. ఆధార్ కార్డు వివరాల ఆధారంగా మృతుడి వివరాలను సేకరించి కుటుంబసభ్యులకు మృతదేహాన్ని పోలీసులు అందించారు. అప్పలయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, ఆత్మహత్య చేసుకోవడానికి అదే కారణమని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గురువారం నాలుగు గంటల ప్రాంతంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాడని, ఆ తర్వాత కాజీపేట సమీపంలో రైతు కింద పడి ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని బంధువులు చెబుతున్నారు.