Bhuma Akhila Priya: రసకందాయంలో నంద్యాల రాజకీయం.. భూమా అఖిలప్రియ హౌస్ అరెస్ట్

Kaburulu

Kaburulu Desk

February 4, 2023 | 08:46 AM

Bhuma Akhila Priya: రసకందాయంలో నంద్యాల రాజకీయం.. భూమా అఖిలప్రియ హౌస్ అరెస్ట్

Bhuma Akhila Priya: నంద్యాల రాజకీయం రసకందాయంగా సాగుతుంది. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ.. వైసీపీ ఎమ్మెల్యే శిల్పారవికి ఓపెన్ ఛాలెంజ్ చేయడం తెలిసిందే. ఈనెల 4న తేదీన ఎమ్మెల్యే శిల్పా రవి అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడతానని అఖిలప్రియ రెండు రోజుల క్రితం ప్రకటించారు. తాను చేసిన అక్రమాలను ఎమ్మెల్యే శిల్పా రవి కూడా బయట పెట్టాలని అఖిలప్రియ సవాల్ విసిరారు.

ఈ నెల 4న నంద్యాలలోని గాంధీ చౌక్ దగ్గరికి రవిచంద్రకిషోర్ రెడ్డి అక్రమాల చిట్టా తీసుకొస్తానని, తాను అక్రమాలకు పాల్పడ్డానంటూ ఎమ్మెల్యే శిల్పా రవి ఆరోపణలు చేస్తున్నారు కదా.. మరి రవి కూడా వాటిని ఆధారాలతో సహా నిరూపించాలని సవాల్ విసిరారు. నేను నిరూపించలేకపోతే క్షమాపణ చెప్తానని.. తాను నిరూపించలేకపోతే తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అఖిలప్రియ చెప్పిన 4వ తేదీ రానే వచ్చేసింది. దీంతో నంద్యాల వేడెక్కింది.

ఇద్దరూ ఎక్కడ కలుస్తారో.. ఏం జరుగుతుందోనని టెన్షన్‌తో నంద్యాల జనం వెయిటింగ్‌. అఖిల ప్రియ సవాల్‌కు శిల్పా స్పందిస్తారా.. నంద్యాల నడిబొడ్డున డిబేట్‌ పెడతారా? అని ఎదురుచూస్తుండగా సాయంత్రం 4 గంటలకు గాంధీ చౌక్ వద్ద చర్చకు రావాలని భూమా అఖిల ప్రియ అక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. అయితే, భూమా అఖిల ప్రియ బహిరంగ చర్చపై పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆళ్లగడ్డలో 30 యాక్ట్ అమలులో ఉన్నందున ఈ బహిరంగ చర్చకు అనుమతి లేదని, అనుమతి లేకుండా ఏర్పాట్లు చేస్తున్నందున ఎందుకు చర్య తీసుకోరాదని నోటీసుల్లో పేర్కొన్నా రు.

భూమా అఖిల ప్రియ వ్యక్తిగత సహాయకునికి కూడా పోలీసులు నోటీస్ ఇచ్చారు. ఆళ్లగడ్డలో అఖిలప్రియను హౌస్ అరెస్ట్ చేసి బయటకి రాకుండా కాపలా కాస్తున్నారు. దీంతో మండిపడుతున్న టీడీపీ శ్రేణులు అఖిలప్రియ ఇంటి వైపు భారీగా మోహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నంద్యాలలో తీవ్ర ఉత్కంఠగా మారింది. సాయంత్రం 4 గంటల సమయానికి కార్యకర్తలు భారీగా మోహరించే అవకాశం ఉండగా ఎప్పుడు ఏం జరుగుతుందన్నది టెన్షన్ పుట్టిస్తుంది.