Drinks in Winter : చలికాలంలో ఇమ్యూనిటీ పెరగడానికి ఈ డ్రింక్స్ తాగండి..

Kaburulu

Kaburulu Desk

November 27, 2022 | 09:47 AM

Drinks in Winter : చలికాలంలో ఇమ్యూనిటీ పెరగడానికి ఈ డ్రింక్స్ తాగండి..

Drinks in Winter :  చలికాలంలో అందరికి తొందరగా జలుబు, దగ్గు, జ్వరం వంటివి వస్తూ ఉంటాయి. దానిని నివారించడానికి చలికాలంలో ఇమ్యూనిటీ పెంచే డ్రింక్స్ తాగాలి మరియు మన శరీరాన్ని ఎప్పుడూ వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వలన చలికాలంలో మనకు వచ్చే అనారోగ్య సమస్యలను నివారించవచ్చు.

*పసుపు పాలు : పసుపు పాలను రోజూ తాగడం వలన ఇమ్యూనిటీ పెరుగుతుంది మరియు శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. పసుపులో యాంటీ వైరల్ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.

*బాదం పాలు : బాదం పాలు తాగడం వలన దానిలో ఉన్న విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు మన ఇమ్యూనిటీని పెంచుతాయి.

*మిరియాల పాలు : ఇవి తాగడం వలన మనకు ఇన్ఫెక్షన్లు వచ్చే సమస్య తగ్గుతుంది. ఇది కూడా మన శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.

*టమాటో సూప్ : చలికాలంలో రోజూ టమాటో సూప్ తాగితే శరీరానికి వెచ్చగా ఉంటుంది.

*అల్లం డికాషన్ : చలికాలంలో అల్లం డికాషన్ తయారు చేసుకొని తాగితే గొంతులో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే పోతుంది. ఇది మన శరీరాన్ని కూడా వెచ్చగా ఉంచుతుంది.