Allu Arjun : బన్నీతో యాడ్ షూట్ చేసిన శ్రీలీల.. ఎవరి డైరెక్షన్ లోనో తెలుసా..?

Kaburulu

Kaburulu Desk

November 27, 2022 | 09:59 AM

Allu Arjun : బన్నీతో యాడ్ షూట్ చేసిన శ్రీలీల.. ఎవరి డైరెక్షన్ లోనో తెలుసా..?

Allu Arjun :  పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ మార్కెట్ మరింత పెరిగింది. ఈ సినిమా తర్వాత వచ్చిన క్రేజ్ ని బాగానే ఉపయోగించుకుంటున్నాడు బన్నీ. ఇటీవల కాలంలో వరుసగా యాడ్స్ చేస్తున్నాడు. పలు కంపెనీలు కూడా అల్లు అర్జున్ తో యాడ్ చేసి తమ బ్రాండ్ వ్యాల్యూ ని పెంచుకోవడానికి చూస్తున్నారు. ఇటీవల వరుసగా ఆహా, శ్రీ చైతన్య సంస్థలు, జొమోటో, ఆస్ట్రోల్ పైప్స్.. లాంటి యాడ్స్ చేశాడు. ఈ యాడ్స్ అన్ని కూడా స్టార్ డైరెక్టర్స్ దర్శకత్వంలోనే చేస్తున్నాడు బన్నీ.

తాజాగా మరో యాడ్ చేశాడు అల్లుఅర్జున్. కన్నడ భామ శ్రీలీల ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఒక పక్క సినిమాలు చేస్తూ ఇప్పుడిప్పుడే కమర్షియల్ యాడ్స్ మీద కూడా దృష్టి పెడుతుంది. శ్రీలీల, బన్నీ కలిసి ఓ ప్రముఖ సంస్థకి యాడ్ చేశారు. అయితే ఆ యాడ్ ప్రోడక్ట్ ఏంటి అనేది ఇంకా బయటకి రాలేదు.

VeeraSimha Reddy : జైజై బాలయ్య.. తమన్ అదరగొట్టేశాడుగా..

బన్నీ, శ్రీలీల మీద ఈ యాడ్ ని త్రివిక్రమ్ డైరెక్ట్ చేశాడు. షూటింగ్ సమయంలో వీరు దిగిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 3 సినిమాలు కూడా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న ఈ యాడ్ ఎలా ఉంటుందో చూడాలి మరి.