Chicken : తందూరి చికెన్ అంటూ.. కాల్చుకొని తింటున్నారా??.. అయితే జాగ్రత్త..

Kaburulu

Kaburulu Desk

November 27, 2022 | 09:28 AM

Chicken : తందూరి చికెన్ అంటూ.. కాల్చుకొని తింటున్నారా??.. అయితే జాగ్రత్త..

Chicken :  ఇటీవల చాలా మంది నాన్ వెజ్ ఎక్కువగా తింటున్నారు. అందులో చికెన్ ఎక్కువగా తింటూ ఉంటారు. చికెన్ ని చాలా రకాలుగా చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, బొంగులో చికెన్, శవర్మ, తందూరీ చికెన్, గ్రిల్ చికెన్ అని వండుకుంటూ ఉంటారు. కానీ ఇటీవల చాలా మంది బయటే రోడ్ల మీద, హోటల్స్ లో ఎక్కడ పడితే అక్కడ చికెన్ అని తింటున్నారు.

సాధారణంగా చికెన్ ని మామూలుగా వండుకొని తింటే మంచి పోషకాలు లభిస్తాయి. కానీ చికెన్ ని డైరెక్ట్ గా మంట మీద పెట్టి కాల్చకూడదు. ముఖ్యంగా తందూరి చికెన్, గ్రిల్ చికెన్ అని ఇటీవల రెస్టారెంట్స్ లో, రోడ్ల మీద, హోటల్స్ లో అక్కడే పొయ్యి పెట్టి అప్పటికప్పుడు కాల్చి ఇస్తున్నారు. ఇలాంటివి ఆరోగ్యానికి చాలా హానికరం. చికెన్ ని మంట మీద కాలిస్తే వెలువడే రసాయనాల వల్ల మనకు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.

Night Food : రాత్రిపూట అన్నం తిన్న తరువాత, తినే ముందు ఈ పనులు చేయండి.. రిజల్ట్ మీరే చూడండి..

ఈ రకమైన క్యాన్సర్ ను మొదటి దశలో గుర్తించలేము. కాబట్టి చికెన్ ని తినే వారు దానిని ఎలా తింటున్నామో ఒకసారి ఆలోచించుకొని మీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని తినాలి. అందరూ గొప్పగా చూపించుకొని అదేపనిగా తినే తందూరి చికెన్, గ్రిల్ చికెన్ ఆరోగ్యానికి మంచిది కాదు. చికెన్ ని మామూలు రకాలుగా వండుకోవాలి అంతేగాని నేరుగా మంట మీద పెట్టి కాల్చకూడదు. కాబట్టి వీలయినంత వరకు ఇలా తినడాన్ని అవాయిడ్ చేయండి.