Finger Millets : షుగర్ తో భాదపడేవారికి.. రాగులు ఎన్ని పోషకాలు ఇస్తాయో తెలుసా?
షుగర్ ఉన్నవారు కొన్ని రకాల ఆహార పదార్థాలని తగ్గించి, షుగర్ తక్కువగా ఉండే పదార్థాలని తీసుకుంటారు. అలాంటివాటిలో రాగులు ఒకటి. రాగులతో చేసిన ఆహారపదార్థాలను..................

Finger Millets : షుగర్ అనేది ఈ రోజుల్లో చాలా మందికి వస్తుంది. ఇప్పుడు నలభై సంవత్సరాలు, అంతకంటే తక్కువ వయసులో ఉన్నవారికి కూడా షుగర్ వస్తుంది. కొంతమంది మహిళలకు గర్భవతులుగా మారినప్పుడు షుగర్ వస్తుంది లేదా ఏదైనా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఎవ్వరికైనా చెక్ చేసుకుంటే అప్పుడు వారికి షుగర్ ఉందని తెలుస్తుంది. ఎక్కువగా దేని గురించి అయినా టెన్షన్ గా ఫీల్ అయినా కూడా షుగర్, బీపీ వంటివి వస్తాయి. అయితే అందరూ వీటిని తగ్గించుకోవడానికి టాబ్లెట్స్ ను కంపల్సరీగా వాడుతుంటారు.
అలాగే షుగర్ ఉన్నవారు కొన్ని రకాల ఆహార పదార్థాలని తగ్గించి, షుగర్ తక్కువగా ఉండే పదార్థాలని తీసుకుంటారు. అలాంటివాటిలో రాగులు ఒకటి. రాగులతో చేసిన ఆహారపదార్థాలను తినడం వలన షుగర్ ను చాలా వరకు కంట్రోల్లో ఉంచుకోవచ్చు. షుగర్ వచ్చిన వారు ఎవ్వరైనా సరే ఒక డైట్ అనేది మెయింటైన్ చేయాలి, తక్కువ ఆహరం తినాల్సి వస్తుంది. కాబట్టి వీరికి ఎక్కువగా ఆకలి అవుతుంటుంది. వీరు రాగులతో చేసిన వంటలు కానీ, రాగి పిండితో చేసిన వంటలు తినడం వలన వారి శరీరానికి అన్ని రకాల విటమిన్స్ అందుతాయి, ఆకలి కూడా తీరుతుంది.
Flower Vase : ఫ్లవర్ వాజ్ లో ఉంచే పువ్వులు ఎక్కువకాలం ఫ్రెష్ గా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా?
రాగిపిండితో జావ (దీనిలో ఉప్పు లేదా బెల్లం ఏదయినా కలుపుకోవచ్చు) లేదా రాగిపిండితో దోశ వంటివి చేసుకొని తినవచ్చు. రాగులలో ఉండే గ్లూటెన్ ధాన్యం ఫైబర్ వంటి పోషకాలు షుగర్ ఉన్న వారిలో షుగర్ ను కంట్రోల్ చేస్తుంది. రాగులను ఆహారంలో భాగంగా తినడం వలన కాల్షియం లోపం మరియు రక్తహీనత వంటివి కూడా తగ్గుతాయి. అలాగే రాగులతో చేసిన ఆహారపదార్థాలను తినడం వలన అధిక బరువు కూడా తగ్గుతారు. అందుకే షుగర్ ఉన్నవాళ్లు కచ్చితంగా రాగులతో చేసిన ఆహారాన్ని రోజూ భాగం చేసుకోవాలి.