Finger Millet’s : రాగిపిండి.. రాగిజావ.. ఇలా రాగులతో ఏదైనా ఆరోగ్యమే..

Kaburulu

Kaburulu Desk

December 25, 2022 | 09:04 PM

Finger Millet’s : రాగిపిండి.. రాగిజావ.. ఇలా రాగులతో ఏదైనా ఆరోగ్యమే..

Finger Millet’s :  చిరుధాన్యాలలో ఒకటైన రాగులను మన ఆహారంగా తీసుకోవడం వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు
కలుగుతాయని మన అందరికీ తెలిసిందే. రాగి పిండితో అనేక రకాలైన వంటకాలను తయారు చేయడంతో పాటు జావలాగా కూడా చేసుకొని తాగుతారు. రాగి ఉండలు, రాగి సంగటి, రాగి రొట్టెలు, రాగి జావ రూపంలో తీసుకుంటారు రాగులని.

కొంతమంది ఉదయం బ్రేక్ఫాస్ట్ లా కుడా రాగిజావను తీసుకుంటారు. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇతర చిరుధాన్యాల కంటే, పాలలో కంటే, రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. నీరసం తగ్గించటానికి ఎముకలను పుష్టిగా ఉండడానికి, జబ్బు చేసి కోలుకుంటున్న వారికి బలాన్ని అందించడానికి ఈ రాగిజావ ఉపయోగపడుతుంది. ఈ జావ చాలా సులభంగా జీర్ణం అవుతుంది.

Potato face Pack : బంగాళాదుంపతో అందం ఇలా..

రాగుల్లో గ్లోకోజ్ పదార్థాలు తక్కువగా ఉంటాయి కావున మధుమేహ రోగులకు మంచి ఆహారం. రాగులలో రక్తంలోని కొలెస్ట్రాల్ ను నియంత్రించి గుండెను రక్షిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు. రక్తప్రసరణ మంచిగా జరుగుతుంది. బరువును కూడా తగ్గిస్తాయి. ప్రస్తుత కాలంలో క్యాల్షియం చాలా అవసరం పాలు, నువ్వులు, ఆకుకూరలతో పాటు రాగుల్లో కూడా క్యాల్షియం బాగా ఉంటుంది.