Kabjaa : కబ్జా సినిమాలో మరో కన్నడ స్టార్ హీరో.. ఆశ్చర్యపరిచిన చిత్రయూనిట్..

కబ్జా సినిమాని పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా మార్చ్ 17న భారీగా రిలీజ్ అవ్వబోతుంది. ఇప్పటికే అన్ని భాషల్లో భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు చిత్రయూనిట్..............

Kaburulu

Kaburulu Desk

March 3, 2023 | 04:59 PM

Kabjaa : కబ్జా సినిమాలో మరో కన్నడ స్టార్ హీరో.. ఆశ్చర్యపరిచిన చిత్రయూనిట్..

Kabjaa :  కన్నడలో KGF తర్వాత భారీ సినిమాలు ఎక్కువగా తెరకెక్కిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కన్నడ స్టార్ హీరోలు ఉపేంద్ర, కిచ్చ సుదీప్ లు హీరోలుగా చంద్రు దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో కబ్జా అనే ఓ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో శ్రియ హీరోయిన్ గా నటించింది. వింటేజ్ మాఫియా కథ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కినట్టు టీజర్ చూస్తుంటే తెలుస్తుంది.

కబ్జా సినిమాని పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా మార్చ్ 17న భారీగా రిలీజ్ అవ్వబోతుంది. ఇప్పటికే అన్ని భాషల్లో భారీగా ప్రమోషన్స్ చేస్తున్నారు చిత్రయూనిట్. టీజర్ చూసిన తర్వాత ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు కన్నడ స్టార్ హీరోలు నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ హైప్ ఉండగా తాజాగా ఓ అప్డేట్ ఇచ్చి సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేశారు చిత్రయూనిట్.

Manushi Chillar : మెగా హీరో సినిమాలో మాజీ విశ్వసుందరి.. రియల్ ఇన్సిడెంట్స్ తో సినిమా..

కబ్జా సినిమాలో మరో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కూడా ఉన్నారని, ఓ ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు అంటూ ప్రకటించారు చిత్రయూనిట్. దీంతో అభిమానులు, ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఇద్దరు స్టార్ హీరోలతోనే భారీ సినిమా అనుకుంటే మరో స్టార్ హీరోని కూడా తీసుకొచ్చి సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు. దీంతో కన్నడ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తెలుగు ఉపేంద్ర ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.