Kantara : కాంతార చిత్ర యూనిట్ కి నోటీసులు ఇచ్చిన కోర్టు.. ఆ పాట తొలిగించాలని ఆదేశాలు..

Kaburulu

Kaburulu Desk

October 29, 2022 | 08:47 AM

Kantara : కాంతార చిత్ర యూనిట్ కి నోటీసులు ఇచ్చిన కోర్టు.. ఆ పాట తొలిగించాలని ఆదేశాలు..

Kantara :  కన్నడలో వచ్చిన కాంతార సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. రిషబ్ శెట్టి హీరోగా తన దర్శకత్వంలోనే తెరకెక్కించిన ఈ సినిమా దేశమంతటా సూపర్ హిట్ అయి మంచి కలెక్షన్లని కూడా రాబడుతుంది. సినిమా చూసి సాధారణ ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు, స్టార్లు కూడా ఈ చిత్ర యూనిట్ ని అభినందిస్తున్నారు.

ఈ సినిమాలో వరాహరూపం అని సాగే ఓ డివోషనల్ సాంగ్ ఉంది. ఈ పాట అందర్నీ అలరించింది. అయితే కొన్ని రోజుల క్రితం తైక్కుడం బ్రిడ్జ్ అనే కర్ణాటకకు చెందిన ఓ ప్రైవేట్ మ్యూజిక్ బ్యాండ్ ఆ పాట మ్యూజిక్ మాదే, కాపీ చేశారని ఆరోపించింది. తైక్కుడం బ్రిడ్జ్ గతంలో చేసిన నవరసం అనే ఓ ప్రైవేట్ ఆల్బుమ్ మ్యూజిక్, కాంతారా సినిమా లోని వరాహరూప మ్యూజిక్ దాదాపు ఒకేలా ఉంది. దీంతో తైక్కుడం బ్రిడ్జ్ కాంతార టీంపై ఆరోపణలు చేస్తూ కోర్టుని ఆశ్రయించింది.

Abhishek Agarwal : కిషన్‌రెడ్డి ఊరిని దత్తత తీసుకున్న కార్తికేయ 2 నిర్మాత

కోజికోడ్ కోర్టు దీనిపై విచారణ జరిపి కాపీరైట్ చట్టం కింద ఆ మ్యూజిక్ తైక్కుడం బ్రిడ్జ్ వారిదే అని, కాంతారా సినిమా వాళ్ళు కాపీ రైట్ చట్టాలని ఉల్లంఘించారని ఆ పాటని అన్ని స్ట్రీమింగ్ ప్లాట్ ఫార్మ్స్ లో తీసేయాలని ఆదేశించింది. సినిమాలో కూడా ఈ పాటని తీసేయాలని కోర్టు కాంతార సినిమా యూనిట్ కి నోటీసులు ఇచ్చింది.