Gauri Khan : మొదటిసారి ఆర్యన్ డ్రగ్ కేసుపై మాట్లాడిన షారుఖ్ భార్య..

Kaburulu

Kaburulu Desk

September 22, 2022 | 09:19 AM

Gauri Khan : మొదటిసారి ఆర్యన్ డ్రగ్ కేసుపై మాట్లాడిన షారుఖ్ భార్య..

Gauri Khan :  బాలీవుడ్ సూపర్ హిట్ షో కాఫీ విత్ కరణ్ ఏడో సీజన్ కొనసాగుతోంది. ఇప్పటికే 11 ఎపిసోడ్లు పూర్తికాగా తాజాగా 12వ ఎపిసోడ్ రిలీజయింది. ఈ ఎపిసోడ్ కి షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్, సీనియర్ నటీమణులు భావన పాండే, మహిమా కపూర్ లు గెస్టులుగా వచ్చారు. ప్రతి ఎపిసోడ్ లో పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడిగే కరణ్ ఈ ఎపిసోడ్ లో కొంచెం తగ్గించినట్టు ఉన్నాడు.

ఈ ఎపిసోడ్ లో గౌరీఖాన్ ని ఆర్యన్ డ్రగ్స్ కేసు గురించి అడిగాడు. కొన్ని నెలల క్రితం షారుఖ్ తనయుడు ఆర్యన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి కొన్ని రోజులు జైలులో ఉండి బయటకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆర్యన్ అరెస్ట్ పై షారుఖ్ మాట్లాడినా గౌరీఖాన్ ఇప్పటివరకు స్పందించలేదు. తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో కరణ్ ఆర్యన్ డ్రగ్స్ కేసు సమయంలో మీరు ఆ పరిస్థితులని ఎలా ఎదుర్కొన్నారు అని గౌరీఖాన్ ని అడిగాడు.

Anchor Lasya : యాంకర్ లాస్య.. రెండోసారి తల్లి కాబోతుందంటూ ఎమోషనల్ పోస్ట్..

దీనికి గౌరీఖాన్ మాట్లాడుతూ.. ఆ సమయంలో మా కుటుంబం మొత్తం బాధపడింది. ఒక తల్లిగా అంతకంటే భయంకరమైన అనుభవం ఇంకోటి ఉండదు. ఆ సమయంలో మాకు చాలా మంది సపోర్ట్ చేశారు. పరిశ్రమలోని వాళ్ళు, బయటి వాళ్ళు మాకు కాల్స్ చేసి, కలిసి మోరల్ సపోర్ట్ ఇచ్చారు. నన్ను చాలా మంది ఓదార్చారు. ఆ సమయంలో మాకు అండగా ఉన్నవారందరికి ధన్యవాదాలు. కానీ అది ఒక చేదు సంఘటనగా గుర్తుండిపోతుంది అని తెలిపింది. మొదటిసారి గౌరీఖాన్ ఆర్యన్ డ్రగ్స్ కేసు పై మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.